📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Crime: కాఫీ గిన్నే మాడిపోయిందని ఇద్దరు బాలికలు ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: August 4, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. స్నేహితుల దినోత్సవం (Friendship Day) రోజున ఇద్దరు ప్రాణ స్నేహితులు విషాదకరంగా ప్రాణాలు కోల్పోవడం ఊరంతా శోకసంద్రంలో ముంచేసింది. వివరాల ప్రకారం రాయదుర్గ మండలంలోని టి. వీరాపురం గ్రామ సమీపంలో దొణగంగమ్మ గుడి వద్ద నీటి కుంటలో ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వారు శ్వేత (11), మౌనిక (9)గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఒకే వీధిలో నివసించే స్నేహితులు, రోజూ కలిసి ఆడుకునే సహచరులు.వివరాల్లోకి వెళ్తే, తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న శ్వేత (Shwetha) కాఫీ తాగాలనిపించి గ్యాస్ స్టవ్ మీద కాఫీ పెట్టుకుంది. ఈ క్రమంలో కాఫీ పెట్టిన గిన్నే కాస్త మాడిపోయి నల్లగా మసిపారిపోయింది.

Crime

ఇద్దరు ప్రాణస్నేహితులు

దీంతో తల్లిదండ్రులు వచ్చి చూస్తే తిడతారని భయపడిపోయిన శ్వేత ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లేముందు శ్వేత తన చెల్లితో తాను దోనగంగమ్మ కుంటలోపడి చనిపోతానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా వెళ్లే క్రమంలోనే తనకు తోడుగా తన స్నేహితురాలైన మౌనికను కూడా శ్వేత వెంటపెట్టుకొని తీసుకెళ్లిందని.. ఆమె చెల్లి కుటుంబ సభ్యులకు తెలిపినట్టు తెలుస్తోంది.ఇక సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విషయం తెలియడంతో హుటాహుటిన దోనగంగమ్మ కుంటకు చేరుకున్నారు. కుంటలో దూకి బాలికల ఆచూకీ కోసం వెతికగా నీటిలో ఇద్దరు బాలికల మృతదేహాలు దొరికాయి. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు ప్రధాన కారణాలు ఏమిటి?

మానసిక ఒత్తిడి, డిప్రెషన్, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు,ఒంటరితనం వంటి కారణాలు ఎక్కువగా ఉంటాయి.

ఆత్మహత్య ఆలోచనలు వస్తే ఏమి చేయాలి?

వెంటనే నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి, హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి, మానసిక వైద్యుల సహాయం పొందాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/weather-alert-heavy-rains-in-andhra-pradesh-for-three-days-imd-warning/weather/525404/

Anantapur district tragedy Breaking News Drowning Incident Friends day sorrow latest news Rayadurgam accident Telugu News TVeerapuram village news Two girls dead Water pond mishap

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.