📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: Crime News: అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి

Author Icon By Anusha
Updated: October 6, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలుగు యువకుల వరుస మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. డల్లాస్‌ (Dallas) లో దుండగుడి కాల్పుల్లో మీర్‌పేటకు చెందిన పోలే చంద్రశేఖర్ మరణించిన వార్త తెలిసి 48 గంటలు గడవక ముందే, మరో హైదరాబాదీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 

Crime News: ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డుప్రమాదం-ఐదుగురు మృతి

అమెరికాలో 48 గంటల్లో రెండోసారి హైదరాబాద్ విద్యార్థి మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్ (Sheraz Mehtab Mohammad) అనే విద్యార్థి అక్టోబర్ 5వ తేదీ (ఆదివారం) నాడు అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. షెరాజ్ చంచల్‌గూడ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవలే అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.

ఇదే 48 గంటల్లో జరిగిన రెండో మృతి. అంతకు ముందు రోజు మరో హైదరాబాద్ విద్యార్థి 28 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ పోలే (Chandrasekhar Pole) టెక్సాస్లోని డల్లాస్లో కాల్పుల్లో మృతిచెందాడు. బీఎన్ నగర్కు చెందిన చంద్రశేఖర్ డల్లాస్లోని గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైమ్‌ పనిచేస్తూ తన ఖర్చులు నెట్టుకొచ్చేవాడు.

Crime News

చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో పట్టా సాధించాడు

శనివారం తెల్లవారుజామున దొంగల దాడిలో ఆయన కాల్పులకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో పట్టా సాధించాడు. 2023 ఆగస్టు 21 నుంచి డెంటన్లోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో డేటా అనలిటిక్స్లో

మాస్టర్స్ చదువుతున్నాడు.చంద్రశేఖర్‌ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ సహాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Chandrashekhar Pol Chicago road accident Dallas shooting latest news Sheraz Mehtab Mohammad student deaths America Telugu News Telugu students USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.