త్రిపురా (Tripura) రాష్ట్రంలోని ఉత్తర త్రిపురా జిల్లా, పానిసాగర్ ప్రాంతం లో 14 నెలల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపాడు. నీలాంబజార్ (Neelambazar) ప్రాంతానికి చెందిన వ్యక్తి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. పాపను ఆడిపించడానికి తీసుకెళ్లాడు.మూడు గంటలు దాటినా కూడా నిందితుడు బిడ్డను తిరిగి ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
Chirutha attack: చిరుత దాడి లో ఆరేళ్ల చిన్నారి మృతి
వెంటనే ఆ చిన్నారిని వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ వరి పొలంలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: