📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Crime News: డీజే మోతతో గుండెపోటు.. నవవధువుతో సహా మరో వివాహిత మృతి

Author Icon By Anusha
Updated: October 6, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల డీజే (DJ) మోతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి వేడుకకు డీజే సౌండ్ ఉండాల్సిందే. అది లేకపోతే వేడుకలకు మజా ఉండదని అనేకుల భావన. దీంతో మితిమీరిన డీజే శబ్దాలతో డ్యాన్స్ చేస్తూ, గుండెపోటుతో మరణిస్తున్న సంఖ్య పెరిగిపోతున్నది.

Drugs: ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ.. 50 మంది మైనర్ విద్యార్థులు

వైద్యులు నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా వారి సూచనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా డీజే సౌండ్లతో చిందులు వేస్తూ, అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు బతుకమ్మ (Bathukamma) ఆడుతూ, డీజే సౌండ్తో గుండెపోటుతో మరణించారు.

గుండెపోటుతో నవవధువు మృతి

భైంసా మండల వానల్ పాడ్ గ్రామం (Vanalpad village of Bhainsa mandal) లో బతుకమ్మ ఆడుతూ డీజే శబ్దాన్ని భరించలేక నవ వధువు గుండెపోటు కుప్పలిపోయింది. రుషిత (22)కొద్దిరోజుల క్రితమే పెళ్లి జరిగింది. బతుకమ్మ సందర్భంగా డీజే శబ్దానికి డ్యాన్స్ చేస్తూ మరణించింది. అత్తగారింటికి వచ్చిన రుషిత బతుకమ్మ
వేడుకల్లో పాల్గొంది.

Crime News

దాదాపు గంటపాటు బతుకమ్మ పండుగలో సంబురంగా ఆడిపాడిన రుషిత (Rushita) ఒక్కసారిగా తనకు తీవ్రమైన తలనొప్పి వస్తుందంటూ ఇంటికి వచ్చింది. ఇంతలోనే గుండెల్లో బరువుగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి, ఒక్కసారిగా కుప్పకూలింది.

అప్పటికే వైద్యులు ఆమె మరణించినట్లు తెలిపారు

ఆసుపత్రికి తరలించగా అప్పటికే వైద్యులు ఆమె మరణించినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాళ్ల పారాణి ఆరకముందే నూరేళ్లు నిండాయని రోదిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బంగల్ పేట కాలనీలో బతుకమ్మ ఆడుతూ భాగ్యలక్ష్మి (Bhagyalakshmi) (56) అనే వివాహిత డీజే సౌండ్ వల్ల గుండెపోటుతో మరణించింది.

ఇటీవల తెలంగాణలో విచ్చలవిడిగా డీజేల శబ్దాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి చిన్న ఫంక్షన్ కు డీజేలతో చిందులు వేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని, ఇలాంటి సంఘటనలను బట్టి తగిన జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

bathukamma festival Breaking News DJ sound death DJ sound effects festival tragedy latest news Telangana news Telugu News Tragic Incident women heart attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.