📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Latest News: Crime: మైనర్ బాలిక హత్యాచారం.. వెలుగులో సంచలన విషయాలు

Author Icon By Anusha
Updated: October 8, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు ప్రేమ కోసం ప్రాణాలను త్యాగం చేసేవారు. ప్రేమలో ఓడిపోతే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా వారి జ్ఞాపకాలతో కాలం గడిపేవారు. అందుకే చరిత్రలో లైలా-మజ్ను, దేవదాసు, అంతోనీ-క్లియోపాత్ర, చర్చిల్-క్లెమెంటైన్, విక్టోరియా-ఆల్బర్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో తమ ప్రేమ గొప్పదని నిరూపించుకున్నారు.

Crime: ప్రియురాలిని హతమార్చి ..ఆపై సమాధిపైనే నిద్ర

నేటికీ వారు ఆదర్శంగా నిలిచారు. కానీ ఆధునిక ప్రేమలు మసకబారిపోతున్నాయి. చాలా ప్రేమలు కేవలం లైంగిక వాంఛల్ని తీర్చుకునేందుకే ప్రేమ ముసుగులో జీవిస్తుంటారు. ఆ కోరిక తీరినవెంటనే వారిని వదిలించుకోవడమో లేక చంపడమో చేస్తుంటారు.

ప్రత్యేకంగా గ్యాడ్జెట్లు (Gadgets) వచ్చాక ఎవరినీ నమ్మలేం. ప్రేమ పేరుతో ఎన్నో ఘోరాలను మనం నిత్యం చూస్తున్నాం. ఇలాంటి ఓ ఘోరం ఇటీవల నల్గొండ (Nalgonda) లో జరిగింది.

లైంగిక దాడి.. ఆపై హత్య

ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే గడ్డం కృష్ణ (22) (Gaddam Krishna) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలికతో ప్రేమాయనం నడిచింది.బాలికను ప్రేమ పేరుతో తన ఉచ్చులోకి లాక్కున్నాడు. బాలిక కాలేజీ వెళ్లిన తర్వాత మధ్యాహ్నం కళాశాల అయిపోయిన తర్వాత గడ్డం కృష్ణ బాలికను ఆటోలో ఎక్కించుకుని, తన స్నేహితుడి గదిలోకి తీసుకెళ్లాడు.

Crime

అక్కడ బాలికపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. దీంతో కృష్ణ బాలికను హతమార్చాడు. ఈ ఉదంతం రాష్ట్రంలో సంచలనంగా మారడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.దీంతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల విచారణలో కృష్ణ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.

బాలిక తీవ్ర రక్తస్రావం కారణంగా ఆందోళన చెందిందని

బాలిక తీవ్ర రక్తస్రావం కారణంగా ఆందోళన చెందిందని, దీంతో ఆమె మరణించినట్లుగా నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే తమ కూతురిపై హత్యాచారం జరిగిందని, అతడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

ఆడపిల్లలు ప్రత్యేకంగా యుక్తవయసులోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ పేరుతో మోసం చేసే ఘరానా మోసగాళ్ల కళ్లు మీపై ఉంటాయని గ్రహించి, నిత్యం అప్రమత్తంగా ప్రవర్తించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను నిత్యం కనిపెడుతూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news nalgonda crime Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.