📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News:  Crime: అత్తతో అక్రమ సంబంధం.. వారికీ భార్య అడ్డుగా వస్తుందనే కోపంతో హత్య

Author Icon By Aanusha
Updated: October 8, 2025 • 6:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు వావీవరసలు మరిచి ప్రవర్తిస్తూ మానవసంబంధాలను మంటగలుపుతున్నారు. పెళ్లైనా ఇతరులతో సంబంధాలు పెట్టుకొని అడ్డు చెప్పిన భాగస్వాములను హత్య చేసి అంతకులుగా మారుతున్నారు.

Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో DSP అరెస్ట్

తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని కాస్‌గంజ్‌లో వెలుగు చూసింది. అత్తతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆత్మహత్య చేసుకుందని నాటకమాడాడు. కానీ అసలు విషయాన్ని పోలీసులు పసిగడుతున్నారని తెలుసుకుని పారిపోయాడు. ఆ తర్వాతే అతడు అత్తతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. దీంతో అసలు బాగోతం బయట పడింది.

ఇదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల శివానికి 2018లో ప్రమోద్‌తో వివాహం జరిగింది. అయితే కొన్నేళ్ల పాటు వీరిద్దరి మధ్య కాపురం బాగానే సాగింది. కానీ గత కొంతకాలంగా ప్రమోద్.. తన అత్తగారు అంటే శివానీ తల్లితోనే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్యకు చెప్పకుండా అత్తగారింటికి వెళ్తూ ఆమెతో శారీరక సుఖం పొందుతున్నాడు.

చాలా రోజుల పాటు ఈ వ్యవహారం బయటపడలేదు

అంతేకాకుండా ఆమెతో సన్నిహితంగా ఫొటోలు దిగుతూ.. వాటిని అప్పుడప్పుడూ చూసుకుని మురిసిపోతున్నాడు. చాలా రోజుల పాటు ఈ వ్యవహారం బయటపడలేదు.కానీ తరచుగూ ప్రమోద్ అత్తగారింటికి వెళ్లడం, అతడు వెళ్లగానే ఇంటి తలుపులు మూయడంతో అందరికీ అనుమానం వచ్చింది. వారి తీరు కూడా అనుమానాస్పదంగా అనిపించడంతో.. ఇదే విషయమై వారిని నిలదీశారు.

Crime

ఓవైపు శివానీ (Shivani) తండ్రి భార్యను అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తుంటే.. మరోవైపు శివానీ తన భర్త ప్రమోద్‌ను మార్చుకోవాలని చూసింది. తరచుగా నీవు చేసేది తప్పని.. తీరు మార్చుకోమంటూ బుద్ధి చెప్పింది. కానీ అత్తతో బంధాన్ని తెంచుకోలేకపోయిన ప్రమోద్.. తమ బంధానికి అడ్డుగా ఉన్న భార్యనే చంపాలనుకున్నాడు. అందుకోసం ఓ పథకం వేసి మరీ ఆమెను చంపేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఆపై ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా భార్య కనిపించకుండా పోయిందంటూ నాటకం ఆడాడు.ముఖ్యంగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే పోలీసులకు మృతదేహం దొరికింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందేమోనని భావించారు.

కానీ పోస్టుమార్టం చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను ఎవరో కొట్టి చంపారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ప్రమోద్‌ (Pramod) పైనే పోలీసులకు అనుమానం ఉండగా.. అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. కానీ అప్పటికే అతడు పారిపోయాడు. మరోవైపు ప్రమోద్, శివానీ తల్లికి సంబంధించిన సన్నిహిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివిధ ప్రాంతాలలో సోదాలు చేస్తూ

అవి కాస్తా పోలీసుల కంట పడగా.. అత్త కోసమే ప్రమోద్ భార్యను చంపాడని పోలీసులు నిర్ధారించారు.ప్రస్తుతం ప్రమోద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేసి వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో సోదాలు చేస్తూ.. శివానీకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Kasganj district latest news Telugu News uttar pradesh crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.