📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Crime: అనుమానంతో భార్య గొంతుకోసి చంపిన భర్త..

Author Icon By Anusha
Updated: August 17, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త చివరికి ఘోరానికి పాల్పడ్డాడు. భార్య తన మాట వినకపోవడంతో కోపం పట్టలేక చివరకు ఆమె ప్రాణం తీశాడు. ఈ ఘటన బంగారుపాళ్యం మండలం (Bangurapalyam Mandal) కోదలమడుగులోని బీసీ కాలనీలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, భర్తకు భార్య ప్రవర్తన నచ్చకపోవడం వల్ల వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త పలుమార్లు “ప్రవర్తన మార్చుకో” అని హెచ్చరించినప్పటికీ భార్య వినకపోవడంతో కోపం అదుపు తప్పింది.ఆ కోపంతో భర్త తన భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. చిత్తూరు జిల్లాలోని కోదలమడుగు గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. భర్త చేసిన ఈ చర్యకు గ్రామంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రవర్తన పట్ల అనుమానం వచ్చింది

నాలుగేళ్ల క్రితం హరిబాబు – ప్రియాంక (21) లకు పెళ్లి జరిగింది.. ఈ దంపతులకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కొంతకాలం వరకు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే.. అనుమానం పెనుభూతంగా మారింది. పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న హరిబాబుకు భార్య ప్రియాంక (Wife Priyanka) ప్రవర్తన పట్ల అనుమానం వచ్చింది. అదే గ్రామంలో ఉన్న మరో వ్యక్తితో ప్రియాంకకు వివాహేతర సంబంధం ఉందని భావించిన హరిబాబు.. ప్రవర్తన మార్చుకోవాలంటూ నచ్చజెప్పాడు.. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.. దీంతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది.

Crime

ఘటనా స్థలానికి చేరుకున్న బంగారుపాళ్యం పోలీసులు

దీంతో హరిబాబు.. ప్రియాంక దగ్గరకు శుక్రవారం వెళ్లాడు.. ఈ క్రమంలోనే.. శనివారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన హరిబాబు.. అక్కడే ఉన్న కత్తి తీసుకుని.. భార్య ప్రియాంకను గొంతు కోసి హత మార్చాడు. అనంతరం బిడ్డను తీసుకుని వెళ్లి.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న బంగారుపాళ్యం పోలీసులు .. వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని బంగారుపాళ్యం పోలీసులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/jr-ntr-i-did-not-scold-junior-ntr-mla-daggubati-prasad/andhra-pradesh/531522/

andhra pradesh crime Breaking News.Latest News Chittoor district Crime News Domestic Violence Case Husband kills wife suspicious husband Telugu News wife behavior issue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.