పది రోజులుగా చావు నన్ను పిలుస్తోంది.. నేను ఎలాగైనా అక్కడికి వెళ్లాలి’ అంటూ యాదాద్రి జిల్లా బీబీనగర్ చెరువు వద్దకు వెళ్లి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతిని తట్టుకోలేక అతని భార్య కూడా అదే చెరువులో దూకింది. హన్మకొండ జిల్లాకు(Hanmakonda district) చెందిన బర్ల సురేందర్ (36) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో(Ramantapur) నివాసముంటున్నాడు. హైటెక్ సిటీలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సురేందర్, గత పది రోజులుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.
భార్యకు వాయిస్ మెసేజ్, ఆత్మహత్య
శుక్రవారం ఉదయం ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన సురేందర్, నేరుగా బీబీనగర్ చెరువుకు చేరుకున్నాడు. అక్కడ తన ఫోన్‌లో “నాకు పది రోజులుగా మానసిక స్థితి బాగా లేదు. చావు రమ్మని పిలుస్తోంది. అందుకే బీబీనగర్ చెరువులో(Bibinagar Lake)దూకి చనిపోతున్నాను. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నా అంత్యక్రియలు పాత ఇంటి వద్ద చేయండి. నెల రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది” అని వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి కుటుంబ సభ్యులకు పంపాడు. అనంతరం తన చెప్పులు, ఫోన్‌ను కట్టపై ఉంచి చెరువులోకి దూకాడు.
భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య యత్నం
సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి వరకు సురేందర్ ఆచూకీ లభ్యం కాలేదు. భర్త పంపిన ఆడియో రికార్డు విని కుటుంబ సభ్యులతో కలిసి చెరువు వద్దకు వచ్చిన భార్య సంధ్యారాణి బోరున విలపించింది. అందరూ సురేందర్ కోసం గాలింపు చర్యలు చూస్తుండగా, కట్టపై కూర్చున్న ఆమె ఒక్కసారిగా చెరువులోకి దూకింది. భర్తతో పాటే తానూ మరణించాలని ఆమె ఈ చర్యకు పాల్పడటంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.
పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షణ
అక్కడే గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి సంధ్యారాణిని రక్షించారు. తండ్రి ఆత్మహత్య, తల్లి కూడా చెరువులో దూకడంతో వారి కుమారుడు “అమ్మా నువ్వు చనిపోవద్దమ్మా” అంటూ రోదించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
సురేందర్ ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు?
యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ చెరువులో సురేందర్ ఆత్మహత్య చేసుకున్నారు.
సురేందర్ భార్యను ఎవరు రక్షించారు?
పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది ఆమెను రక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: