📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Crime: ప్రభుత్వ ఉద్యోగం పోతుందనే భయంతో.. బిడ్డను అడవిలో పారేసిన దంపతులు

Author Icon By Aanusha
Updated: October 2, 2025 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనిషి క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచే ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లాలో వెలుగుచూసింది. తల్లిదండ్రులే ఓ పసి శిశువును అడవిలో వదిలేయడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డను, జీవితం మొదలైన గంటల్లోనే అడవి చెట్ల కింద పడేయడం మానవత్వాన్ని అవమానపరిచే ఘటనగా నిలిచింది.

TamilNadu: ఏపీ యువతిపై గ్యాంగ్‌రేప్.. కానిస్టేబుళ్ల ను విధుల నుంచి సస్పెండ్ చేసిన డీఎంకే ప్రభుత్వం

ఒక రాత్రంతా ఆ చిన్నారి చలిలో, చీమ కాట్లతో, ఊపిరి ఆడని పరిస్థితిలో రాయి కింద గడిపాడు. కానీ, ఉదయం వేళ ఏడుపులు విన్న కొందరు. ఓ రాయిని తొలగించగా, రక్తమోడుతూ వణుకుతున్న ప్రాణాలతో ఉన్న శిశువు కంటబడ్డాడు. అయితే, తన ఉద్యోగం పోతుందనే ప్రభుత్వ టీచర్ తన భార్యతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఛింద్వారా జిల్లాకు చెందిన బబ్లూ దండోలియా (Bablu Dandolia) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన భార్య రాజకుమారి దండోలియాతో కలిసి శిశువును అడవిలో పడేశారు. ఇది వారికి నాలుగో సంతానం కావడంతో బిడ్డను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా, ‘ఇద్దరికి మించి పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు’ అన్న నియమం కారణంగా భయం పట్టుకుంది.

గర్భం దాల్చిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టింది

రాజకుమారి గర్భం దాల్చిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టింది.సెప్టెంబర్ 23 తెల్లవారుజామున ఇంట్లోనే బిడ్డను ప్రసవింంచగా.. కొన్ని గంటల్లోనే బిడ్డను అడవిలోకి తీసుకెళ్లి రాయి కింద ఉంచారు. మార్నింగ్ వాకర్లు శిశువు ఏడుపు విన్నారు. అయితే, ఏదో జంతువు అనుకున్నామని, దగ్గరగా వెళ్లి చూడగా, రాయి కింద చిన్నచిన్న చేతులు కదులుతున్నాయని ఓ గ్రామస్థుడు తెలిపారు.

 Crime

ఇలాంటి పని ఏ తల్లిదండ్రులు చేయకూడదని మండిపడ్డాడు.అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చిన శిశువును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఛింద్వారా జిల్లా ఆసుపత్రి వైద్యులు శరీరంపై చీమ కాట్లు ఉన్నాయని, హైపోథర్మియా (Hypothermia) లక్షణాలు ఉన్నాయని నిర్ధారించారు. ‘ఈ పరిస్థితిలో ఒక రాత్రంతా బతకడం అనేది అద్భుతమే,’ అని తెలిపారు. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఆ శిశువు సురక్షితంగా ఉన్నాడు.

శిశుమరణాలు మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ జరుగుతున్నాయి

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ… సీనియర్ అధికారులతో మేము చర్చిస్తున్నామని, BNS 1019 (హత్యాయత్నం) కింద కూడా కేసు నమోదు చేసే అవకాశముందని అన్నారు. కాగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. భారత్‌లో వదిలేసిన శిశుమరణాలు మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ జరుగుతున్నాయి.

పేదరికం, సామాజిక కట్టుబాట్లు, ఉద్యోగ సంబంధిత భయాలు ఈ ఘటనలకు కారణం అవుతున్నాయి. అయితే ఈ ఘటన అత్యంత భయంకరమైంది. ఎందుకంటే ఇది పేదరికం వల్ల కాదు, చదువుకున్న కుటుంబం బాధ్యతను తప్పించుకోవడానికే ఈ మార్గాన్ని ఎంచుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Chhindwara Infant Incident latest news Madhya Pradesh Baby Abandoned Newborn Found Under Rock Parents Leave Baby in Forest Teacher Couple Crime MP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.