📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Crime: వ్యాపారంలో నష్టాలు..అప్పులు తీర్చలేక దంపతుల ఆత్మహత్య

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Crime ఆస్తులు లేకపోయినా పర్వాలేదు అప్పులు మాత్రం ఉండకూడదని అంటారు. అప్పులే మెడకు ఉరితాడుగా మారుతున్నాయి. ఇప్పటికే అప్పులతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దొరికిన చోటంతా అప్పులు చేస్తారు. అధిక వడ్డీలకు తీసుకుంటారు. ఏదో చేయాలనుకుంటారు. కానీ ఆ ప్రయత్నంలో భారీగా నష్టాలు వస్తాయి. ఈలోగా అప్పులు తీర్చులేంతగా పేరుకునిపోవడంతో ఇక చేసేది లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువ. తాజాగా అప్పుల బాధను తట్టుకోలేక దంపుతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.

Read Also: JNTU: ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

Crime Business losses… Couple commits suicide after failing to pay debts

హైదరాబాద్ లోని నాగోలులో దంపతుల మృతి హైదరాబాద్ లోని (Hyderabad) నాగోలు, చైతన్యపురి ఠాణాల పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ మక్బూలానీ, ఎస్సై వెంకటయ్యల కథనం ప్రకారం యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన గడ్డమీది మల్లేశ్ (45), సంతోష(37) దంపతులు హైదరాబాద్ కొత్తపేట సమీపంలోని మార్గదర్శి కాలనీలో ఏడేళులగా ఉంటున్నారు. వీరికి శివ(20), మేఘన(17), మౌనిక(15) సంతానం. గతంలో మల్లేష్ స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. ఊళ్లోని పొలం, ఇల్లు అమ్మేశారు. అప్పటి నుంచి కొత్తపేటలోని రైతుబజార్ లో దంపతులిద్దరూ కూరగాయలు అమ్ముతున్నారు. వడ్డీలతో అప్పులు పెరుగుతున్నాయి.

కూల్ డ్రింక్స్ లో పురుగుమందు తాగారు

శుక్రవారం తెల్లవారుజీమున ఉదయం నడకకు వెళ్లారు. తట్టిఅన్నారం సమీపంలో జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతానికి బైక్ పై వెళ్లారు. వెంట తెచ్చుకున్న పురుగుమందును కూల్ డ్రింక్స్ లో కలుపుకొని తాగారు. ఉదయం 7.45 గంటలకు కుమారుడు శివ నంబరుకు ఓ వాయిస్ మెసేజ్ వచ్చింది. తన పేరిట రూ.20 లక్షలు, తల్లి పేరిట రూ.20లక్షలు ఎస్ బీఐలో లభిస్తాయని తండ్రి చెప్పిన మాటలు విని భయపడ్డాడు. వెంటనే మల్లేష్ కు ఫోన్ చేసినా తీయలేదు.

భయంతో చైతన్యపురి పోలీసులను సంప్రదించాడు. పోలీసులు అతని తండ్రి చేసిన చివరి కాల్ ఆధారంగా లొకేషన్ తెలుసుకొని తట్టిఅన్నారం సమీపంలోకి వెళ్లారు. చెట్ల పొదల్లో అపస్మారకస్థితిలో ఉన్న దంపతులిద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంతోష అప్పటికే చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్లేశ్ కూడా మృతి చెందారు. దీంతో తమకు ఇక దిక్కు ఎవరు అంటూ రోదించసాగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Business loss; couple suicide debt crisis; family tragedy. financial distress Google News in Telugu Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.