📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Crime: తోడబుట్టిన సోదరుడినే కత్తితో పొడిచి చంపిన బాలుడు..ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: August 11, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత సమాజంలో నేరాలు, ఘోరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇందులో వయసు, స్థాయి, నేపథ్యం ఏమాత్రం పరిశీలన కాకుండా కొన్ని దారుణ ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటిదే ఒక మిస్టరీ సంఘటన ఒడిశా రాష్ట్రం బలాంగీర్ జిల్లా (Balangir district, Odisha state) టిట్లాగఢ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ కేసు కొన్ని రోజులుగా మిస్టరీగానే ఉంది. అయితే.. చిన్న కుమారుడు అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమవ్వడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత తల్లికి పెద్ద కుమారుడిపై అనుమానం కలిగింది. దీంతో ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. విచారణలో భాగంగా పెద్ద కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతడు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తానే తన తమ్ముడిని హత్య చేశానని.. ఆ తర్వాత మృతదేహాన్ని పాతిపెట్టానని చెప్పాడు.

పూర్తి వివరాలు

నిందితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య చేసిన తర్వాత మొదట ఇంటి వెనుక మృతదేహాన్ని పాతిపెట్టాడు. తర్వాత దాన్ని బయటకు తీసి 300-400 మీటర్ల దూరంలో మరో చోట మళ్లీ పాతిపెట్టాడు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు జరిపిన బలాంగీర్ ఎస్పీ మీడియాకు సంచలన విషయాలను వెల్లడించారు. జూన్ 28న కేసు నంబర్ 216/25 కింద 12 ఏళ్ల నారాయణ అనే బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేశారు. తల్లి ఫిర్యాదు ఆధారంగా నార్తర్న్ రేంజ్ ఐజీ ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని (A special team) ఏర్పాటు చేశారు. టిట్లాగఢ్ డీఎస్పీ, స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఈ బృందంలో ముఖ్య పాత్ర పోషించారు. బలాంగీర్, కాలాహాండి, నువాపడా, రాయపూర్ జిల్లాల్లో బాలుడి కోసం వెతికారు కానీ ఫలితం రాలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను మళ్లీ ప్రశ్నించగా.. తల్లి చెప్పిన వివరాల ఆధారంగా పెద్ద కుమారుడిపై అనుమానం మరింత బలపడింది. ఆపై కేసు దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికి వచ్చాయి.

Crime:

క్రైమ్ సీన్ రీక్రియేట్ చేసి

విచారణలో పెద్ద కుమారుడు భూపేష్, తన తమ్ముడిపై వంటగదిలో ఉండే సుమారు 6 ఇంచుల పొడవైన పదునైన కత్తితో దాడి చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక పాతిపెట్టి, రాత్రి 1 గంట సమయంలో తల్లి చీర సహాయంతో బయటకు తీసి 300 మీటర్ల దూరంలోని మరో చోట పాతిపెట్టాడు. మేజిస్ట్రేట్, వైద్య అధికారులు, పోలీసు, సైంటిఫిక్ టీమ్ సమక్షంలో క్రైమ్ సీన్ రీక్రియేట్ చేసి, మృతదేహాన్ని వెలికితీశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించిన చీరను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పెద్ద కొడుకుకు చిన్న కొడుకుపై ముందు నుంచే కోపం ఉండేది. తల్లిదండ్రుల ప్రేమ చిన్న కొడుకు పుట్టిన తర్వాత తనపై తగ్గిపోయిందని భావించేవాడు. అది. కాస్తా భరించలేని స్థితికి చేరి ఎలాగైనా తన తల్లిదండ్రులకు చిన్న కొడుకుపై ఉన్న ప్రేమను దూరం చేయాలని, దానికి అతనిని చంపడమే సరైన మార్గమని భావించాడు.

ప్రాథమిక విచారణలో

అనుకున్నదే అనువుగా హత్యకు మంచి తరుణం కోసం వేచి చూశాడు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగా ఇంట్లో చిన్న గొడవ జరిగింది. అది కాస్తా పెద్దగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు దారి తీసింది. అప్పటికే చిన్న కొడుకుపై అసహనం పెంచుకున్న పెద్దవాడు వంటగదిలోని సుమారు 6 ఇంచుల పొడవైన పదునైన కత్తితో పొడిచాడు. అయితే, ఈ హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. ఇంట్లో జరిగిన చిన్న గొడవకే తోడబుట్టినవాడిని చంపడం, అది కూడా మైనర్ బాలుడు కావడం, చంపుకునేంత కసి పెరగడం, ఈ పరిణామాలన్నీ పలు అనుమానాలకు తావిచ్చాయి. మైనర్ బాలుడే ఆవేశంలో దాడి చేసి చంపాడా, మరెవరైనా ఈ నేరానికి ప్రేరేపించారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రతి అంశాన్ని లోతుగా విచారిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. హత్యకు పాల్పడిన పెద్ద కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మైనర్ బాలుడు తన సోదరుని హత్య చేసిన ఘటన ఏది?

ఒడిశా రాష్ట్రం బలాంగీర్ జిల్లా టిట్లాగఢ్‌లో ఒక మైనర్ బాలుడు చిన్న తమ్ముడిని హత్య చేసి అతని శవాన్ని పాతిపెట్టిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ఈ హత్యకు కారణం ఏమిటి?

చిన్న వివాదం కారణంగా మధ్యలో తెరలేచి వ్యవహారం ప్రాణాంతకమైంది. పూర్తి వివరాలు పోలీసులు విచారణలో వెల్లడిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/yash-dayal-yash-dayal-banned-over-sexual-allegations/national/528909/

Breaking News family dispute turns deadly latest news minor boy murders brother minor homicide case minor kills sibling Odisha Balangir shocking crime Telugu News Titlagarh incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.