📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Crime: దొంగతనం కేసులో మహిళను చితకొట్టిన యజమాని..అయితే సీన్ రివర్స్

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు (Bangalore) లో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. నగరంలోని ఒక ప్రసిద్ధ చీరల షాపులో మహిళ ఒక పెద్ద మొత్తంలో చీరలను దొంగిలించిందని షాపు యజమాని ఆరోపించారు.చీరలు కొనుగోలు చేస్తానంటూ ఓ దుకాణంలోకి వెళ్లిన మహిళ.. అక్కడే చాలా సేపు ఉండి రూ.90 వేల విలువ చేసే చీరలు దొంగిలించింది.

ఈ విషయం గుర్తించిన షాపు యజమాని, అతని సిబ్బంది మహిళను నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. ఆపై అత్యంత దారుణంగా కొట్టారు. కాళ్లతో తన్నుతూ.. తీవ్ర పదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ కావడంతో.. ఈ చర్యపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Crime: అయ్యో ఎంతపని జరిగింది చిట్టితల్లి.. పాలగిన్నెలో పడిన చిన్నారి

ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బెంగళూరు అవెన్యూ రోడ్డులోని ‘మాయా సిల్క్స్ శారీస్’ అనే వస్త్ర దుకాణంలోకి ఈ నెల 20వ తేదీన ఓ మహిళ ప్రవేశించింది. దుకాణదారుల కళ్లుగప్పి సుమారు రూ.91,500 విలువ చేసే 61 చీరలు ఉన్న ఒక కట్టను ఆమె దొంగిలించింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో (CCTV cameras) రికార్డయ్యాయి.

దీనిపై దుకాణం యజమాని సిటీ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే, మరుసటి రోజే ఆ మహిళ మళ్లీ అదే దుకాణం వద్ద కనిపించడంతో యజమాని, అతని సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. దొంగిలించిన చీరల గురించి నిలదీస్తూ, ఆమెను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తంతూ, తీవ్ర పదజాలంతో దూషించారు.

కన్నడ సంఘాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం

ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోపై కన్నడ సంఘాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దొంగతనం చేస్తే పోలీసులకు అప్పగించాలి కానీ, ఇలా నడిరోడ్డుపై ఒక మహిళపై దాడి చేయడం ఏమిటని మండిపడ్డారు.

ఒత్తిడి పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు.దొంగతనం ఆరోపణలపై సదరు మహిళను అరెస్ట్ చేసి, ఆమె నుంచి చీరలను స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళపై దాడికి పాల్పడిన దుకాణం యజమాని, అతని సిబ్బందిని కూడా అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

assault incident bengaluru Breaking News latest news police intervention Public Outrage saree shop theft shop owner attack Telugu News Viral Video woman assaulted

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.