2025 సంవత్సరం(Crime 2025) ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, ఈ ఏడాది చోటుచేసుకున్న కొన్ని నేరాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ ఘటనల్లో మహిళలు కీలక పాత్ర పోషించడం సంచలనంగా మారింది.
Read Also: Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక
2025లో వార్తల్లో నిలిచిన ప్రధాన కేసులు
- కన్నడ సినీ నటి రన్యారావు భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం కలకలం రేపింది. ఆమె వద్ద నుంచి సుమారు రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి, శవాన్ని డ్రమ్‌లో ఉంచి సిమెంట్‌తో మూసివేయడం దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది.
- సోనమ్ రఘువంశీ తన భర్తను హనీమూన్ నెపంతో మేఘాలయకు తీసుకెళ్లి, అక్కడ కిరాయి హంతకులతో హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
- జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
- డాక్టర్ షాహీన్ సయీద్, ఇతర వైద్యులతో కలిసి దేశవ్యాప్తంగా భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
సమాజాన్ని ఆలోచింపజేసిన ఘటనలు
ఈ కేసులు మహిళల పాత్రపై(Crime 2025) కొత్త చర్చకు తెరలేపాయి. నేరాలు లింగభేదం లేకుండా జరుగుతాయని, చట్టం ముందు అందరూ సమానమే అన్న అంశాన్ని ఈ సంఘటనలు మరోసారి గుర్తుచేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: