వాట్సాప్ వినియోగదారులను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ (Sajjanar) అప్రమత్తం చేశారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన (Sajjanar) హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సాప్‌లో “హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ వచ్చే లింకుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు.
Read Also: Hyderabad Cyber: రూ. 14.61 కోట్ల సైబర్ మోసం.. నలుగురు అరెస్ట్..
మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్
ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్. ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. చివరికి మీ ఖాతాను మీరే వాడకుండా లాక్ చేస్తారు. అని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: