📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest Telugu News: Syrup:’దగ్గు మందు’పై దర్యాప్తు​- ఏడు ప్రాంతాల్లో ఈడీ దాడులు

Author Icon By Vanipushpa
Updated: October 13, 2025 • 3:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘కోల్డ్‌రిఫ్‌’ దగ్గు మందు(Syrup)ను తయారు చేస్తున్న తమిళనాడులోని శ్రీసన్‌ ఫార్మా సంస్థపై దర్యాప్తు వేగవంతమైంది. చెన్నైలో శ్రీసన్‌ ఫార్మాకు సంబంధమున్న ఏడు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్‌ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని సీనియర్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల నివాసాలు, శ్రీసన్‌ ఫార్మాకు సంబంధమున్న ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు సమాచారం. కోల్డ్‌రిఫ్‌ దగ్గు సిరప్‌ తాగి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో 24 మంది చిన్నారులు మృతిచెందారు. దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ను సూచించగా అందులోని విషపదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్‌రిఫ్‌ను నిషేధించాయి.

Read Also: Indian Army Jobs 2025:ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

Syrup:’దగ్గు మందు’పై దర్యాప్తు​- ఏడు ప్రాంతాల్లో ఈడీ దాడులు

తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే మరణాలకు కారణం

మరోవైపు కోల్డ్​రిఫ్​ సిరప్​ తయారుచేసిన శ్రేసన్​ ఫార్మా యూనిట్​ యజమాని రంగనాథన్​(73)ను ఇటీవల అరెస్ట్​ చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని వెల్లడించారు. ఈ కంపెనీని వారు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తనిఖీ చేయలేదన్నారు. దర్యాప్తులో భాగంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ పలు వైఫల్యాలను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దగ్గుమందు వికటించి మరణించిన వారిలో ఎక్కువగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారని ఇటీవల అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మార్కెట్​లోకి విషపూరితమైన సిరప్​

సంబంధిత వర్గాలు వెల్లడించిన నివేదిక ప్రకారం, రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ నిబంధనలను విస్మరించిందని, కేంద్ర సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపాయి. దగ్గుమందు తయారీ విషయంలో సరైన పర్యవేక్షణ లేదని, సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో విషపూరితమైన సిరప్​ మార్కెట్​లోకి ప్రవేశించి పిల్లల మరణాలకు కారణమయ్యిందని తెలిపాయి. ఆ ఫార్మా సంస్థలో ఏ ప్రభుత్వ ఏజెన్సీ ఆడిట్​ నిర్వహించలేదని తెలుస్తోంది. అదే విధంగా ఔషధ తయారీ సంస్థగా ఈ కంపెనీ కేంద్ర పోర్టల్​లో రిజిస్టర్​ కాలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు.

శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లైసెన్స్‌ను రద్దు!

మరోవైపు మధ్యప్రదేశ్​లో పిల్లల మరణాలకు కారణమని భావిస్తున్న కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం సోమవారం ప్రకటించింది. కోల్డ్‌రిఫ్ అనే దగ్గు సిరప్‌లో విషపూరిత కలుషితాలు, ముఖ్యంగా డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దగ్గమందు మరణాల నేపథ్యంలో తమిళనాడులోని తయారు కంపెనీలో తనిఖీలు చేయగా దుర్భరమైన మౌలిక సదుపాయాలు, జాతీయ ఔషధ భద్రతా నియమాలను అనేకసార్లు ఉల్లంఘించడం, దశాబ్ద కాలంగా నియంత్రణ లేకుండా కార్యకలాపాలను కొనసాగించడం వంటివి చేస్తోందని సెంట్రల్​ డ్రగ్స్ స్టాండర్డ్​ కంట్రోల్​ ఆర్గనైజేషన్​ తెలిపింది.

పిల్లలకు సిరప్ ఎలా ఇవ్వాలి?
మందును కొద్ది మొత్తంలో (1 నుండి 2 టీస్పూన్లు) లేదా రసం లేదా తీపి నీటితో కలపండి. ఒక చెంచాతో ఇవ్వండి లేదా మీ బిడ్డకు త్రాగనివ్వండి.

సిరప్ దేనితో తయారు చేయబడింది?
మాపుల్ సిరప్ కొనండి | మసాచుసెట్స్ మాపుల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
సిరప్ ప్రధానంగా నీటిలో కరిగిన చక్కెరతో తయారు చేయబడుతుంది, అయితే చక్కెర రకం మరియు ఇతర పదార్థాలు ఉత్పత్తిని బట్టి విస్తృతంగా మారుతూ ఉంటాయి. సాధారణ రకాల్లో సింపుల్ సిరప్ (చక్కెర మరియు నీరు)

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Cough syrup case drug investigation ED raids Enforcement Directorate illegal medicine Latest News Breaking News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.