📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Lady SI: ఖమ్మం కల్లూరులో ఉద్రిక్తత: మహిళా ఎస్‌ఐపై కాంగ్రెస్ నేత దాడి

Author Icon By Shobha Rani
Updated: June 7, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఖమ్మం (Kammam) జిల్లా కల్లూరులో కాంగ్రెస్‌ నేతలు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐ(Lady SI) పై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు… నిందితుడిని, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే… నిన్న‌ రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్‌ నేత రాయల రాము కల్లూరు(Kallur) ఎన్‌ఎస్పీలోని ఓ హోటల్‌కు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాము.. పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. గొడవ ముదరడంతో రాము తన అనుచరులకు సమాచారం ఇచ్చాడు. తల్లాడ నుంచి కల్లూరు(Kallur)కు భారీగా చేరుకుని హల్‌చల్‌ చేశారు.

Lady SI: ఖమ్మం కల్లూరులో ఉద్రిక్తత: మహిళా ఎస్‌ఐపై కాంగ్రెస్ నేత దాడి

దాడికి దిగిన నేత – శారీరక దౌర్జన్యం
దీంతో హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న కల్లూరు (Kallur) ఎస్‌ఐ హరిత.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు వినకపోవడంతో పాటు మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ నేత రాయలు రాము సహా అతని అనుచరులు పోలీసులను దూషిస్తూ మహిళా ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో ఎస్‌ఐ హరిత.. రాముపై చేయి చేసుకున్నారు. కాంగ్రెస్‌ నాయకుడు రాము… నన్నే కొడతావా అంటూ విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. మహిళా అని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు రాముతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఈ ఘటన కేవలం ఒక మహిళా పోలీసు అధికారిపై దాడి మాత్రమే కాదు, సమాజంలో చట్టం పట్ల గౌరవం ఏ స్థాయిలో ఉందో చూపే ఉదాహరణ. అధికారులు కేసును నిష్పాక్షికంగా విచారించి ఆమెకు న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also: Telangana: బడికి వేళాయే..సిద్ధపడుతున్న పిల్లల

Breaking News in Telugu Congress leader attacks female SI Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.