📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Actor Vishal: కోయంబత్తూర్‌ ఘటన.. నిందితులకు మరణశిక్ష విధించాలని విశాల్‌ డిమాండ్

Author Icon By Anusha
Updated: November 8, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాక్షన్ హీరో విశాల్‌ (Vishal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పేరు, ఇమేజ్‌ చాలా పెద్దది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ విశాల్‌కు అభిమానూలు ఉన్నారు.. ఆయన నటించిన సినిమాలు తరచుగా తెలుగులోనూ విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి.

Read Also: Hyd Crime: కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం

ప్రత్యేకించి ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు, మాస్ డైలాగ్‌లు ప్రేక్షకులను అలరిస్తాయి. హిట్ లేదా ఫ్లాప్ అనే తేడా లేకుండా ప్రతి ఏడాది, రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు, విశాల్‌ (Vishal) ప్రస్తుతం, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోగా కొనసాగుతున్నారు.

కోయంబత్తూర్‌ విమానాశ్రయం సమీపంలో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. త‌న స్నేహితుడితో కారులో ఉన్న ఓ విద్యార్థినిని ముగ్గురు యువకులు అపహరించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు.

ఈ అత్యాచారాలను రాజకీయం చేయడం మానుకోండి

ఈ ఘటనపై కేసు నమోదు చేమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.అయితే ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. రాత్రిపూట ఆ విద్యార్థిని బయటకు ఎందుకెళ్లిందని ఎమ్మెల్యే ఈశ్వరన్‌ (MLA Easwaran) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పురుషుడితో బయటకు వెళ్లడాన్ని సామాజిక పతనంగా అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

తాజాగా హీరో విశాల్‌ (Vishal) సైతం ఈ వ్యవహారంపై స్పందించాడు. విశాల్ ఎక్స్ వేదిక‌గా రాసుకోస్తూ.. ఆ సమయంలో ఆ ప్రదేశంలో బాధితురాలు ఎందుకు ఉందని నిందించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న ఈ అత్యాచారాలను రాజకీయం చేయడం మానుకోండి.

విశాల్‌ సైతం ఈ వ్యవహారంపై స్పందించాడు

న్యాయవ్యవస్థ ముందు మోకరిల్లి అడుగుతున్నా.. మీ కాళ్లు పట్టుకుంటా.. దయచేసి ఇంత దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులకు మరణశిక్ష వేయండి. గతంలో నిర్భయ (Nirbhaya) ఉదంతాలను చూశాం. ఏడేళ్ల బాలికను అత్యాచారం చేయడంతో పాటు కన్న తల్లిని నిర్దాక్ష్యిణ్యంగా హత్య చేసిన వ్యక్తి సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో నిర్దోషిగా బయటకు వచ్చాడు.

ఇలాంటివి సౌదీ అరేబియా (Saudi Arabia) వంటి దేశాల్లో సాధ్యమవుతాయా? ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) తీసుకున్న చర్యలు నిజంగా మెచ్చుకోదగినవి. ఆయనకు నేను సెల్యూట్‌ చేస్తున్నా.. అని విశాల్‌ ట్వీట్‌ చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Telugu News vishal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.