విజయవాడ : ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి సైబర్ మోసాల ముఠాకు చిక్కుకున్న ఏపీకి చెందిన 22 మందిని సీఐడీ పోలీసులు రక్షిoచారు. ఈ అంశంపై సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడుతూ సైబర్ క్లావరీ స్లేవరీలో భాగంగా ఈస్ట్ ఆసియా దేశాలలో చిక్కుకున్న భారతీయులకు విముక్తి కలిగించామన్నారు. ఫ్రీ జాబ్ ఆఫర్స్ కోసం విదేశాలకు వెళ్లి సైబర్ క్రైమ్ కూపంలో ఇరుక్కుంటున్నారని.. బ్యాంకాక్, మయన్మార్, కంబోడియా వంటి దేశాలలో జాబ్ కోసం వెళ్లిన భారతదేశ యువకులు ఈ సైబర్ ముఠా ట్రాప్ లో పడుతున్నారని తెలిపారు. కాల్ సెంటర్ల ద్వారా యువతను ఆకట్టుకునేలా మాటలు చెబుతున్నారని.. ఫ్లైట్ టిక్కెట్లు కూడా ఏర్పాటు చేసి, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలుకుతారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. ఆయా దేశాల్లో 15 గంటల ప్రయాణం తర్వాత అటవీ ప్రాంతంలో ఉంచి.. సైబర్ క్రైమ్ లో భాగస్వామ్యులుగా చేస్తున్నారని అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. పాస్పోర్టు, ఫోన్లు లాగేసుకుని.. అనేక విధాలుగా రూ.10లక్షలు సైబర్ క్రైమ్ చేయిస్తున్నారని చెప్పారు.
Read also: Tirupati Crime : తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు
CID AP
హనీ ట్రాప్‌లతో బలవంతపు సైబర్ క్రైమ్‌లు
హనీ ట్రాప్‌లతో బలవంతపు సైబర్ క్రైమ్‌లు
ఫోన్లు చేసి హనీ ట్రాప్లు చేసేలా వీరిని బలవంతంగా ఒప్పించి పని చేయిస్తారన్నారు. మాట వినకుంటే.. తిండి పెట్టకుండా… ఇబ్బందులు పెడతారని.. బెదిరించి, చెప్పినట్లు మోసం చేస్తేనే వారికి తిండి పెడతారని ఆయన తెలిపారు. ఎవరైనా వెళ్లిపోతామంటే.. డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. దీంతో ఏ దారి లేక చాలా మంది భారతీయ యువత ఈ తరహాలో మోసపోయి.. సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్నారని సీఐడీ ఎస్సీ అదిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. భారతదేశ ప్రభుత్వం ఈ తరహా మోసాలను గుర్తించి వారిని తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసిందని సీఐడీ ఎస్పీ తెలిపారు. ఈ విధంగా తాజాగా 22మంది ఏపీకి చెందిన వారిని క్షేమంగా తీసుకురాగా, వారిని సీఐడీ విచారించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,586మంది ఇలా సైబర్ మోసాల బారిన పడిన వారిని మూడు నెలల్లో వెనక్కి తీసుకువచ్చారన్నారు.
సైబర్ మోసాల నుంచి బాధితులకు విముక్తి
సైబర్ మోసాల నుంచి బాధితులకు విముక్తి
వీరిలో ఏపీకి చెందిన వారు 120 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో పురుషులతోపాటు మహిళలు, యువత కూడా చాలా మంది ఉన్నారన్నారు. అక్కడ ఎలా మోసం జరుగుతుంది.. ఆకర్షితమైన ప్రకటనలు ఎలా ఉంటాయో వారు తెలిపారని చెప్పారు. భారతీయ రీజనల్ లాంగ్వేజ్ బాగా మాట్లాడే వారిని గుర్తించి మరీ ఈ మోసాల్లోకి దింపుతున్నారని చెప్పారని సీఐడీ ఎస్పీ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు, పెద్ద జీతం చూపినప్పుడు పూర్తిగా వెరిఫై చేసుకున్నాకే ఆయా దేశాలకు వెళ్లాలని సూచించారు అదిరాజ్ సింగ్ ఇటువంటి ఆఫర్లు వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే.. ఆ సంస్థ గురించి ఆరా తీసి వివరాలు ఇస్తారన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల గురించి ఆలోచన చేయాలని.. మంచి ఉద్యోగం, జీతం అనగానే అప్పులు చేసి పిల్లలను ఆయా దేశాలకు పంపవద్దని సూచించారు. డబ్బులతోపాటు, పిల్లల భవిష్యత్ కూడా నాశనం అవుతుందని హెచ్చరించారు.
విదేశీ ఉద్యోగ మోసాలపై హెచ్చరికలు
ఇటువంటి మోసాలపై మీడియా కూడా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా కోరారు. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి సంప్రదించాం. మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఫ్లైట్ టిక్కెట్లు వారే ఇచ్చారు. అక్కడకు వెళ్లిన తర్వాత మారు మూల ప్రాంతానికి తరలించారు. రెండు నెలలు వీసా ఇచ్చి.. వారి ఆధీనంలో ఉంచుకున్నారు. పాస్ పోర్టు, ఫోన్లు కూడా లాగేసుకుంటారు. వారు ఇచ్చే ఫోన్లనే ఆపరేట్ చేయాలి. ఫేక్ ఎకౌంట్లను క్రియేట్ చేసి వాటి ద్వారా ఆపరేటివ్ చేయిస్తారు. 500 టూ 10006 వరకు మాకు లక్ష్యాలు ఇచ్చి.. మాట్లాడిస్తారు. మయన్మార్లో గత రెండు నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డాం. అసలు ఎవరితో అక్కడ మేము మాట్లాడే అవకాశం ఉండదు. వారికి స్పెషల్ ఆర్మీ ఉంటుంది.. చేతిలో గన్లు ఉంటాయి. ఏదైనా మాట్లాడితే.. చంపేస్తామని బెదిరిస్తారు. ఒక్కో గదిలో పది మంది సభ్యులకు షెల్టర్ ఇస్తారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే.. గదిలో బంధించి చిత్ర హింసలు పెడతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: