📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

Author Icon By Tejaswini Y
Updated: January 30, 2026 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Chittoor Road Accident

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపింది.

Read Also: Delhi Crime: ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

వివరాల్లోకి వెళితే

ఎస్ఆర్ పురం (SR Puram) మండల పరిధిలోని సమీప గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు జీడీనెల్లూరు వైపు బయలుదేరింది. బస్సు బీసీ కాలనీ సమీపంలోకి చేరుకోగానే, అతివేగంగా వెనుక నుంచి వచ్చిన ఒక లారీ బస్సును బలంగా ఢీకొట్టింది.

ఒకరికి నాలుక తెగి..

ప్రమాద తీవ్రతకు బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఒక విద్యార్థికి బలంగా దెబ్బ తగలడంతో నోటి భాగంలో తీవ్ర గాయమై నాలుక తెగిపోయినట్లు సమాచారం అందుతోంది. ఈ వార్త విన్న తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఆస్పత్రికి తరలింపు.. పోలీసుల దర్యాప్తు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh crime news Chittoor Road Accident GD Nellore Lorry Hits School Bus School Bus Accident SR Puram Student Injuries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.