📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Chinmayi: జానీ మాస్టర్‌పై చిన్మయి ఫైర్

Author Icon By Aanusha
Updated: November 12, 2025 • 9:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌, సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై సంచలన ఆరోపణలు చేశారు.మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ తన పరిచయాలు, పలుకుబడి వలన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసు..నేడు CID విచారణకు ప్రకాశ్ రాజ్

తీవ్ర స్థాయిలో స్పందించారు

ఈ విషయమై ఆమె సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి, సినీ పరిశ్రమలో జరుగుతున్న ఈ విధమైన సంఘటనలపై తీవ్ర స్థాయిలో స్పందించారు.జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనదని, కొందరు దీన్ని ఇద్దరి సమ్మతితో జరిగిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చిన్మయి (Chinmayi) ఆరోపించారు.

“ఒక మేజర్ అయిన వ్యక్తి మైనర్ బాలికను లోబరుచుకున్నప్పుడు అది కచ్చితంగా మేజర్‌దే తప్పవుతుంది. బాధితురాలు సహకరించనప్పుడు బెదిరించి లొంగదీసుకోవడం దారుణం” అని ఆమె పేర్కొన్నారు.ఈ విషయంపై తాను మాట్లాడిన ప్రతిసారి జానీ మాస్టర్ భార్య తనకు ఫోన్ చేసి మాట్లాడవద్దని చెబుతోందని చిన్మయి (Chinmayi)వెల్లడించారు.

Chinmayi

నిరూపించే ఆధారాలు ఉన్నాయని

తమ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని ఆమె అంటున్నారని తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.ఒకవేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే, ఇక అవార్డుల మీద అవార్డులు వస్తాయని, అతన్ని విమర్శించిన వారే అతని నిర్దోషిత్వం గురించి గొప్పగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు.

“మైనర్ బాలికలతో శృంగారాన్ని థ్రిల్‌గా భావించే మహానుభావులకు ఈ అంశం మరింత ఉపకరిస్తుంది. భారీ స్థాయిలో విజయోత్సవాలు జరుపుకోవచ్చు. మైనర్లను వేధించి ఎలా తప్పించుకోవాలో వారికి కచ్చితంగా తెలుస్తుంది” అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఏదేమైనా, ఆ బాధితురాలైన అమ్మాయి విజయం సాధించాలని తాను ప్రార్థిస్తున్నానని చిన్మయి తెలిపారు. నిందితుడికి శిక్ష పడి, ఆమెకు న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు తన పోస్టులో ముగించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Chinmayi Sripaada jani master latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.