📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Chhattisgarh HighCourt: భార్య ఆత్మహత్య బెదిరింపులు కూడా క్రూరత్వమే..

Author Icon By Pooja
Updated: December 6, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు(Chhattisgarh HighCourt) ఒక కీలక తీర్పులో, భార్య తరచూ ఆత్మహత్య(Suicide) చేసుకుంటానని బెదిరించడం, భర్తను మతం మార్చమని ఒత్తిడి చేయడం కూడా మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ ప్రవర్తన విడాకులకు బలమైన ఆధారమని పేర్కొంటూ, బలోద్ జిల్లా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.

Read Also: NTR District Crime: జగ్గయ్యపేటలో యువకుడిదారుణ హత్య

కేసు నేపథ్యం

2018 మేలో బలోద్ జిల్లాకు చెందిన దంపతులు వివాహం చేసుకున్నారు. కానీ కొద్దికాలానికే భార్య తరచుగా ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడిందని భర్త పేర్కొన్నాడు. విషం తాగడానికి ప్రయత్నించడం, కత్తితో తనను తాను గాయపర్చుకోవడం, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటానని బెదిరించడం వంటివి జరిగినట్లు భర్త 2019 అక్టోబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పరిస్థితుల్లో తాను నిరంతరం భయంతో జీవించాల్సి వచ్చిందని చెప్పాడు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ రజనీ దూబే, జస్టిస్ అమితేంద్ర కిషోర్ ప్రసాద్‌లు — శారీరక హింస మాత్రమే కాదు, మనసులో భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా క్రూరత్వమే అని వ్యాఖ్యానించారు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేశారని భర్త తెలిపిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆరోపణపై ఉన్న సాక్ష్యాలను కూడా ధర్మాసనం నమోదు చేసింది.

విడాకుల తీర్పుకు హైకోర్టు నిలువరింత

2019 నవంబర్ నుంచి దంపతులు విడిగా ఉంటున్నారని, తిరిగి కాపురానికి వస్తానని భార్య ఎటువంటి ఆసక్తి చూపలేదని కోర్టు గమనించింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించిన హైకోర్టు(Chhattisgarh HighCourt) — భార్య ప్రవర్తన చట్టపరంగా క్రూరత్వం కిందకే వస్తుందని తేల్చి చెప్పి, భర్తకు మంజూరైన విడాకులను కొనసాగిస్తూ, భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu IndianLaw Latest News in Telugu MentalCruelty

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.