📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Chevella Crime News: చేవెళ్లలో భర్తను చంపిన భార్య

Author Icon By Anusha
Updated: February 21, 2026 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chevella Crime News: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన ఓ భార్య, ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా అంతమొందించింది. ఆపై ఏమీ తెలియనట్టుగా మద్యం తాగి కింద పడి మరణించాడంటూ కట్టుకథ అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.

Read Also: Tadigadapa Job Scam: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు వసూలు

పరిచయం.. అక్రమ సంబంధం.. చివరకు హత్య

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణ, రాజేశ్వరి దంపతులు చేవెళ్లలో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటూ ఉండేవారు. ఆరు నెలల క్రితం రాజేశ్వరికి శరత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కృష్ణ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తన దారికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని రాజేశ్వరి తన ప్రియుడు శరత్‌తో కలిసి పథకం వేసింది.

మద్యం మత్తులో పడిపోయాడని డ్రామా.. గుట్టురట్టు చేసిన పోలీసులు

పథకం ప్రకారం రాజేశ్వరి, శరత్ కలిసి కృష్ణను హత్య చేశారు. ఆ తర్వాత కృష్ణ విపరీతంగా మద్యం తాగి కింద పడిపోవడంతో మరణించాడని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, కృష్ణ మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. రాజేశ్వరి, శరత్ తమ నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Chevella Crime News Hyderabad crime Illegal Affair Crime latest news wife kills husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.