हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest News: Chevella Accident: ముగ్గురు కూతుళ్ల పరిహారం చెక్కు.. ఆ తండ్రికి ఉప్పొంగిన దుఃఖం

Anusha
Latest News: Chevella Accident: ముగ్గురు కూతుళ్ల పరిహారం చెక్కు.. ఆ తండ్రికి ఉప్పొంగిన దుఃఖం

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నిపింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సును ఒక టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది తాండూరు ప్రాంతానికి చెందినవారని అధికారులు వెల్లడించారు.

Read Also: Drugs: ఎల్‌టీటీఈతో దావూద్ ఇబ్రహీం పొత్తు

ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ. 2 లక్షలు చొప్పున మొత్తం రూ. 7 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ మేరకు నేడు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (Buyyani Manohar Reddy) బాధిత కుంటుంబాలకు చెక్కులను అందించారు.

మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. చెక్కులను అందుకుంటూ బాధిత కుంటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో తాండూరు వడ్డెర గల్లీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికంగా కారు డ్రైవర్‌గా పని చేసే ఎల్లయ్య గౌడ్ కుమార్తెలైన వీరు.. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ (Hyderabad) వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.

Chevella Accident
Chevella Accident

కూతుళ్లు దూరమైన బాధతో ఆయన విలపించిన తీరు

తనూష ఎంబీఐ చదువుతోండగా.. సాయిప్రియ, నందిని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్, ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. నవంబర్ 2న ఉదయం ట్రైన్ మిస్ కావటంతో తాండూరులో బస్సు ఎక్కి ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ రోజు పరిహారం చెక్కులను వారి తండ్రి ఎల్లయ్య గౌడ్‌ (Ellaiah Goud) కు ఎమ్మెల్యే అందించారు.

ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున మెుత్తం రూ.21 లక్షల చెక్కులను ఇవ్వగా.. వాటిని చూసిన ఎల్లయ్య గుండెలు పగిలేలా రోధించారు. ‘నా కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది’ అంటూ ఆయన విలపించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.

ఎల్లయ్య గౌడ్ ఆవేదన అక్కడున్న వారిని కదిలించింది. కూతుళ్లు దూరమైన బాధతో ఆయన విలపించిన తీరు కన్నీరు పెట్టించింది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం ఉపశమనం కలిగించినా.. బిడ్డలు లేని లోటు మాత్రం పూడ్చలేనిదంటూ స్థానికులు సైతం కంటతడి పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870