Cherlapally crime: హైదరాబాద్ చర్లపల్లి రైల్వేట్రాక్‌పై విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లి ఇలాంటి ఘోర నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమైఉంటుందనే చర్చ జరుగుతోంది. తమకు ఎలాంటి సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన రెడ్డి, విశాల్ రెడ్డిని కారులో చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు ముందు విజయరెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ప్లాట్‌ఫామ్‌పై చాలా సాధారణంగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Read Also: Mirchi : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రికార్డు ధర పలికిన దేశీ మిర్చి
ఆత్మహత్యల వెనుక కారణాలపై దర్యాప్తు
ఇక వీరి ఆత్మహత్యలను నివారించడంలో చర్లపల్లి స్టేషన్లో వున్న భద్రతా సిబ్బంది తీరు గురించి విమర్శలు రావడంతో దీనిపైనా రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్కు(Railway Station CCTV) వచ్చినట్లు సిసి కెమెరాల్లో వుంది. దీని తరువాత కారు తాళాలను కుమారుడు విశాల్ రెడ్డి జేబులో వుంచింది. అనంతరం ఇద్దరు పిల్లలతో స్టేషన్లో అటు ఇటూ అరగంట పాటు తిరిగింది.
అర్ధరాత్రి వేళ ఒక మహిళ ఇద్దరు పిల్లలతో రైళ్ల రాకపోకలు లేని సమయంలో స్టేషన్లో ఎందుకు తచ్చాడుతుందనే దానిపై భద్రత సిబ్బంది ఎందుకు గమనించలేదనే అంశంపైనా రైల్వే పోలీసులు విచారి స్తున్నారు. దీని తరువాత ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి చీకట్లో ఘట్కేసర్ మార్గంలో రైలు పట్టాలపై వెళుతున్నపుడు కూడా ఎవరూ గమనించకపోవడం కూడా భద్రతా సిబ్బంది వైఫల్యంగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. విజయశాంతి రెడ్డి సెల్ఫోన్ తో పాటు ఇతర వస్తువులను జప్తు చేసిన పోలీసులు దీనిని ఎఫ్ఎస్ఎల్కు పంపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: