📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Big Alert : వెంటనే అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్చుకోండి

Author Icon By Sudheer
Updated: June 25, 2025 • 6:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన డేటా లీక్ (Data Leak) ఘటనలో దాదాపు 1,600 కోట్ల సోషల్ మీడియా అకౌంట్ల లాగిన్ డేటా హ్యాక్ అయినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా వినియోగదారులు తమ అకౌంట్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్చరించింది.

వెంటనే పాస్వర్డ్లు మార్చుకోవాలి

ఈ భారీ హ్యాకింగ్ ఘటనలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గ్మెయిల్, లింక్డిన్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల అకౌంట్లు లక్ష్యంగా అయ్యే అవకాశం ఉందని సర్ట్-ఇన్ పేర్కొంది. డేటా దొంగిలింపు ప్రమాదాన్ని నివారించేందుకు వెంటనే మీ అకౌంట్ల పాస్‌వర్డ్లు మార్చుకోవాలని, బలమైన పాస్వర్డ్లు ఉపయోగించాలని సూచించింది. అంతేకాకుండా ఒకే పాస్‌వర్డ్‌ను అనేక అకౌంట్లకు ఉపయోగించకుండా ఉండాలని, టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా యాక్టివేట్ చేయాలని కోరింది.

సిస్టమ్ అప్డేట్స్ తప్పనిసరి

కేవలం పాస్‌వర్డ్ మార్పే కాకుండా, మీ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాపులు, కంప్యూటర్లు లేటెస్ట్ వెర్షన్‌కు అప్గ్రేడ్ చేయడం కూడా భద్రత పరంగా చాలా ముఖ్యం అని సూచించింది. సాఫ్ట్‌వేర్‌లు, బ్రౌజర్లను కూడా రీసెంట్ వెర్షన్లకు నవీకరించాలి. ఫిషింగ్ ఇమెయిళ్లకు, అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలని, గుర్తు తెలియని డౌన్‌లోడ్‌లను చేయవద్దని సూచించింది. సైబర్ ముప్పుల నుంచి మీ డేటాను కాపాడుకోవడం ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్ట్-ఇన్ స్పష్టం చేసింది.

Read Also : Cabinet :కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి తెలియాలి.. కేంద్ర కేబినెట్‌

Big alert Change your account passwords Data Leak Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.