📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Chandrayangutta: విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈనెల 27వ తేదీన వినాయక చవితి పండుగ రానున్నది. దీంతో రోడ్లపక్కన ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇక విగ్రహాలతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ పండుగ సామాజిక పండుగ. పిల్లలు, యువత, పెద్దలు అందరూ కలిసి ఆనందంగా చేసుకునేందుకు అందరూ తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పండుగ అంటే ఎవరికైనా ఆనందమే కదా! కానీ ఈ ఆనందం కాస్త విషాదంగా మారుతున్నది. కారణం విద్యుత్ శాఖ (Electricity Department) నిర్లక్ష్యం, ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి. విగ్రహాలను తరలిస్తున్న సమయంలోవిద్యుత్ వైర్లను తాకి, క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇద్దరు యువకుల మృతి

చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా బండ్లగూడ వద్ద ట్రాక్టర్కు కరెంటు వైర్లు తగిలి ఇద్దరు,యువకులు మరణించారు. ఆదివారం కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఉప్పల్లోని రామాంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ శోభాయాత్రకు వెళ్తున్న వారు విద్యుత్ వైర్లకు తగిలి ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారు వివిధ ఆస్పత్రుల్లో,చికత్స పొందుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల (Krishna Janmashtami celebrations) లో భాగంగా రామంతపూర్ పాతబస్తికి చెందిన సర్వ రవీందర్ యాదవ్ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ వేడుకల్ని నిర్వహిస్తుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన యాత్ర ర్యాలీని స్థానిక ప్రజాప్రతినిధులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.హఠాత్తుగా వారి రథానికి విద్యుత్వైర్లు తగిలింది. దీంతో రథం కింద ఉన్న యువకులు విద్యుత్ షాక్ కు గురై మృత్యువాతపడ్డారు. అంబర్పేటలో వినాయక మండపం వేస్తుండగా మరో విద్యుత్ షాక్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు.మృతులు వికాస్, ధోనీలుగా గుర్తించారు.

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం

కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు మరణిస్తున్నారని, విద్యుత్ వైర్లు తెగి, నేలపై వేలాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, పలుచోటు విద్యుత్వైర్లు పైకి ఉండాల్సిన చోట, తక్కువ ఎత్తులోనే వైర్లు వ్రేలాడుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నాయని ప్రజలు
మండిపడుతున్నారు. వైర్లు ఎక్కడెక్కడ తెగిపోయాయి, కిందకు జారిన వైర్లను సరిచేయడంలో అధికారులు విఫలమయ్యారని, తద్వారానేప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏదిఏమైనా పండుగ సీజన్లో విద్యుత్ వైర్లపట్ల అప్రమత్తంగా ఉండాలి.ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడా వైర్లు తెగినేలపై పడుతున్నాయి.

    Read hindi news: hindi.vaartha.com

    Read also:

    https://vaartha.com/warangal-crime-master-plan-with-boyfriend-to-kill-husband-but-it-turned-out-to-be-an-ultimate-flop/telangana/532436/

    bandlaguda electrocution Breaking News chandrayangutta accident krishna janmashtami tragedy latest news puranapool ganesh idol ramantapur gokula nagar

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.