Ayesha Meera murder case closed: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన తుది నివేదికను పరిశీలించిన అనంతరం, కేసును మూసివేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండవసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు.
Read Also: Breaking news: Terror Plot in Hyderabad: భాగ్యనగరంలో ఉగ్ర కుట్ర భగ్నం?
అసలేం జరిగింది?
2007లో జరిగిన ఆయేషా మీరా హత్య తర్వాత పోలీసులు, పలువురు అమాయకుల్ని నిందితులుగా చేర్చి ఈ కేసును క్లోజ్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన తప్పుడు కేసుల్ని కోర్టులు కొట్టేయడంతో ఆ అమాయకులకు ఊరట లభించింది. అయితే ఇప్పటికీ ఆయేషా మీరా కుటుంబం మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన సీబీఐ.. ఆయేషా మీరా సమాధిని తవ్వి అవశేషాల్ని సేకరించింది.వీటిని కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ నివేదికను అందజేసింది.
అయితే ఇందులో నిందితుల ప్రస్తావన ఉందో లేదో ఇంకా తేలలేదు. అయితే న్యాయప్రక్రియ పూర్తి కావడంతో సీబీఐ సేకరించిన తమ కుమార్తె అవశేషాల్ని తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లితండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ పాషా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. సీబీఐని ఆమె అవశేషాల్ని తిరిగి కుటుంబానికి అప్పగించేలా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 27న మరోమారు కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ తల్లితండ్రులు సిద్దమవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: