📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Calcutta: కోల్‌కతాలో దారుణం..బాయ్స్ హాస్టల్లో యువతిపై అత్యాచారం

Author Icon By Sharanya
Updated: July 12, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా (Calcutta) లో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించేలా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇది ఉత్తమ విద్యాసంస్థగా పేరొందిన ఐఐఎమ్ కోల్‌కతా (IIM Kolkata) లో జరిగిన అవాంఛనీయ సంఘటన. అకడమిక్ ప్రతిష్ఠకు నిదర్శనంగా నిలిచే ఈ విద్యాసంస్థలో అబద్ధాల వలలోకి వెళ్లిన యువతి, తీవ్ర మానసిక మరియు శారీరక హింసను అనుభవించాల్సి వచ్చింది.

పరిచయం నుంచి దుర్వినియోగం వరకు:

ఐఐఎమ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న యువతి (girl studying in the first year)కి, యువతికి సెకండ్ ఇయర్ చదివే యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది. ఇద్దరూ తరచుగా చాటింగ్, ఫోన్లు చేసుకునేవారు. గత కొంత కాలంనుంచి ఆ యువతికి తోటి విద్యార్థినితో గొడవలు జరుగుతున్నాయి.

నమ్మకాన్ని వాడుకున్న యువకుడు:

శుక్రవారం రాత్రి యువతి సెకండ్ ఇయర్ యువకుడికి ఫోన్ చేసింది. విషయం చెప్పి ఏం చేయాలో సలహా అడిగింది. ‘ఈ విషయం గురించి చర్చిద్దాం మా హాస్టల్‌కు వచ్చేయ్’అని అన్నాడు. అమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. మరో స్నేహితురాలిని వెంట బెట్టుకుని అక్కడికి వెళ్లింది. ఒంటరిగా మాట్లాడదాం అని చెప్పి ఆ యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత తినడానికి తిండి, తాగడానికి కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. అతడు పెట్టిన ఆహారం తినగానే ఆమె స్ప్రహ కోల్పోయింది. తర్వాత అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. యువతి అతడి బెదిరింపులకు భయపడలేదు. అక్కడినుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల తక్షణ స్పందన:

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు రాత్రి ఐఐఎమ్ హాస్ట‌ల్‌లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ విచారణను కొనసాగిస్తున్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Chirag Paswan: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బాంబు బెదిరింపు!

Breaking News CalcuttaNews HostelCrime IIMIncident JusticeForVictim KolkataCrime latest news StopRape Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.