Latest News: Chevella Accident: రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్బ్రాంతి

Read Time:  1 min
Bus Accident
Bus Accident
FONT SIZE
GET APP

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Bus Accident) రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాఢ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read Also: Gujarat Crime: అన్నను చంపిన 15 ఏళ్ల బాలుడు.. ఆపై గర్భవతి వదినపై హత్యాచారం

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్ (Hyderabad) ​కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్​, డీజీపీలను ఆదేశించారు. మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది.

Chevella Accident
Chevella Accident

మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.