📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest Telugu News: UP Bride: భర్తలకు మత్తుమందు.. ఆపై నవ వధువులు పరార్

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర భారతదేశంలో కర్వా చౌత్ (karwa chauth) అనే పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తమ భర్తల ఆరోగ్యం బాగుండాలని, నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భార్యలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజే కొంతమంది మహిళలు దారుణమైన మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌(Aligarh)లో ఏకంగా 12 ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వధువులు తమ కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన భోజనాన్ని పెట్టి ఇంట్లో నుంచి డబ్బు, నగలతో జంప్ అయ్యారు.

Read Also: Bilateral Trade Agreement: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో

UP:భర్తలకు మత్తుమందు.. ఆపై నవ వధువులు పరార్

అన్నంలో మత్తుమందు

ముందుగా వారు పండుగ రోజు అందరితో కలిసి ఇంట్లో గోరింటాకు పెట్టుకొని ఎంతో సందడి చేశారు. అందరితో నమ్మకంగా ఉంటూ ఇంట్లో దేవతలకు పూజలు కూడా చేశారు. రోజంతా ఉపవాసం ఉన్నారు. తమ భర్తలకు హారతి ఇచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు అందరిని నమ్మించారు. కానీ, మనసులో మాత్రం భోజన సమయం ఎప్పుడెప్పుడు అవుతుందా? అంటూ ఆలోచిస్తూ పన్నాగాలు పన్నారు. రాత్రి భోజన సమయం కాగానే అందరికీ అన్నంలో మత్తుమందు కలిపారు. ఉపవాసం ముగించిన తర్వాత ఆ అన్నాన్ని అందరికీ వడ్డించారు. వారంతా స్పృహ కోల్పోగానే ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు, ఫోన్లు అన్ని ఒక బ్యాగులో సర్దుకొని అక్కడినుంచి పరారయ్యారు.

వెలుగులోకి 12 ఘటనలు

మత్తు మూలంగా స్పృహ కోల్పోయిన వారందరికీ ఉదయం మెలకువవచ్చింది. అయితే వధువులు కనిపించకపోవడం, ఇల్లంతా చిందర వందరగా ఉండటం గమనించి షాక్ అయ్యారు. ఏం జరిగిందో అర్ధం కాక ఇంట్లో వాళ్ళందరినీ నిద్రలేపారు. ఇంట్లోని లాకర్లు తెరిచి చూడగా ఖాళీగా ఉండటం చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటి ఘటన తమ కుటుంబంలోనే జరిగిందని ఇంట్లో వారు అనుకుంటుండగా.. ఒక్కొక్కటిగా 12 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మా ఇంట్లో కూడా ఇలాగే జరిగింది అంటూ అన్ని కుటుంబాలు లబోదిబో మంటూ ఏడ్వటం మొదలు పెట్టారు. 12 కుటుంబాల నుంచి మొత్తంగా రూ.30 లక్షలకు పైగా డబ్బు, నగలు అపహరించుకుపోయినట్లు వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఇలా 12 ఇళ్లల్లో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు ఆశ్ఛర్యానికి గురయ్యారు. ఇందులో ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ దాగివుందని అనుమానం వ్యక్తం చేయడంతో పాటు.. ఆ దిశగా విచారణ చేపట్టారు. వధువులు డబ్బు, నగలతో పరారవ్వడం తో దర్యాప్తులో స్పీడు పెంచారు.

దోపిడీ వెనక బ్రోకర్లు కీలక పాత్ర

కాగా పక్కా ప్లాన్ ప్రకారం ఇది ఓ ముఠా చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నరు. ఈ దోపిడీ వెనక బ్రోకర్లు కీలక పాత్ర పోషించారని అనుకుంటున్నారు. కొందరు దుండగులు ముఠాగా మారి, అమ్మాయిలను డబ్బున్న అబ్బాయిలతో పెళ్లి చేసి అనువైన సమయం చూసుకొని డబ్బు, నగలతో ఉడాయించాలని ముందే ప్లాన్ చేసుకుని ఈ మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి.. ఒక్కో పెళ్లికి రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తారని వివరించారు. పెళ్లిళ్లు చేసుకున్న కొద్ది రోజుల్లోనే తమ భర్త, అత్తమామల వద్ద నమ్మకంగా ఉంటూ వారితో మంచివారిగా నటిస్తారని చెప్పారు. కొందరు గుడికి వెళ్లడం, మరికొందరు పనుల్లో సహాయం చేయడం వంటివి చేస్తూ ఎలాంటి అనుమానం రాకుండా తమ మోసాన్ని సాఫీగా చేసుకుంటారని వివరించారు. కొత్తగా పెళ్ళైన బాధితుడు లబోదిబోమంటున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bride Scams Crime News Drugging Cases Husbands Drugged Indian crime news Marriage Fraud Newlywed Crimes shocking incidents Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.