📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Breaking News: అన్యమతస్తుడితో వివాహేతర సంబంధం.. ఇద్దరికీ గుండుగీసి ఊరేగింపు

Author Icon By Anusha
Updated: August 7, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తోటిమనిషిని ప్రేమించాలి అని ఏ మతమైనా బోధిస్తుంది. నీ,పొరుగువారు ఆపదలో ఉంటే సాయం చేయమని చెబుతుంది. జంతువులు సైతం తమ జాతి వాటిని ప్రేమించుకుంటాయి. ఒకదానికి ఆపద వస్తే, మిగిలిన,జంతువులన్ని పోగైపోతాయి. పక్షలు కూడా ఇంతే. కానీ తోటిమనిషి సాయం చేయలేకపోయినా పర్వాలేదు కానీ, వారి గౌరవానికి మాత్రం భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదు. వారేదో అక్రమం చేసారని, వారిని సరైన మార్గంలో పెట్టాలనే ప్రయత్నంలో మనమే అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అలాంటి వారిని,ఏమనాలి? వారికి ఎలాంటి శిక్షలు విధించాలి? సరిగ్గా బీహార్లో (Bihar) ఇలాంటి ఘటనే జరిగింది. దీనికి సంబంధించిన,పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Breaking News

పంచాయితీ పెట్టి గుండు గీసారు

వివాహిత సునీత (32) షకీల్ (40)తో సన్నిహితంగా ఉండగా చూసిన గ్రామస్తులు వారిద్దరిని పట్టుకున్నారు.అన్యమతస్తుడితో సన్నిహితంగా ఉందని స్థానిక పంచాయితీ (Local Panchayat) ఆదేశాల మేరకు ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు,నల్లరంగు పూసి, ఆపై మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కటిహార్ జిల్లా ఫల్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.మీడియాలో చూసిన ప్రియుడి భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకితీసుకున్నారు. ఇద్దరికీ పిల్లలు ఉన్నారని, దర్యాప్తు అనంతరం వారిపై తగిన చర్య తీసుకుంటామని జిల్లా ఎస్పీ శిఖర్ చౌధరి మీడియాలో తెలిపారు. కానీ వారిపట్ల గ్రామస్తులు చేసిన హేయమైన చర్యలకు చట్టం ఎలాంటి శిక్షను విధిస్తుందో చూడాలి మరి.

బీహార్ రాజధాని ఏది?

బీహార్ రాజధాని పాట్నా.

బీహార్‌లో ప్రధానంగా మాట్లాడే భాషలు ఏమిటి?

హిందీ, మైథిలీ, భోజపురీ, మగహీ, అంగిక.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dharmasthala-human-burial-case-six-more-involved/crime/527051/

Bihar Breaking News community justice Crime crime in Bihar human values Humanity Indian Penal Code injustice latest news law Respect social awareness SOCIETY Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.