Boyfriend kidnapped: బెంగళూరులో సంచలనం సృష్టించిన ఒక కిడ్నాప్ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్‌లో ట్రావెల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న లారెన్స్ మెల్విన్ అనే వ్యక్తిని అతడి గాళ్‌ఫ్రెండ్ మహిమ ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేయించింది. ఈ కిడ్నాప్ వెనుక డబ్బు డిమాండ్ ఉందని పోలీసులు తెలిపారు.
కిడ్నాప్ వివరాలు
Boyfriend kidnapped: లారెన్స్ మెల్విన్ ఇటీవల బెంగళూరుకు వచ్చాడు. ఈ నెల 16 నుంచి అతను కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతడి తల్లి అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లారెన్స్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు అతడి కుటుంబానికి ఫోన్ చేసి రూ.2.5 కోట్లు డిమాండ్ చేయడంతో కేసు తీవ్రత పెరిగింది.
పోలీసుల దర్యాప్తులో, ఈ కిడ్నాప్ వెనుక లారెన్స్ గాళ్‌ఫ్రెండ్ మహిమ (Lawrence girlfriend Mahima) కుట్ర ఉందని తేలింది. ఈ నెల 14న “బయటకు వెళ్దాం” అని చెప్పి లారెన్స్‌ను కారులో తీసుకెళ్లింది. కొంతదూరం వెళ్ళాక డ్రైవర్ కారును దారి మళ్లించాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కారులోకి ప్రవేశించి లారెన్స్‌పై దాడి చేసి, అతడి వద్దనున్న రూ. 1 లక్ష నగదును లాక్కున్నారు.
ఎనిమిది రోజుల పాటు చిత్రహింసలు
కిడ్నాపర్లు లారెన్స్‌ను ఒక అపార్ట్‌మెంట్‌లో బంధించి, దాదాపు ఎనిమిది రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో, లారెన్స్ కుటుంబానికి ఫోన్ చేసి రూ.2.5 కోట్లు డిమాండ్ చేశారు.
కేసు ఛేదన, నిందితుల అరెస్ట్
అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఒక మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే స్పందించి, లారెన్స్‌ను సురక్షితంగా కాపాడారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన కుట్రదారుగా గుర్తించిన మహిమతో పాటు మరో ముగ్గురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన బెంగళూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Hindi News : hindi.vaartha.com
Read also: Tamil Nadu: అక్కను ప్రేమించాడని ఆసుపత్రి లోనే హతమార్చిన తమ్ముడు