📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest News: CM Revanth: వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు.. స్పందించిన సీఎం

Author Icon By Anusha
Updated: December 3, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వీధి కుక్కల దాడిలో, మూగబాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.హైదరాబాద్ లోని మన్సూరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన సీఎం.. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే బాలుడికి సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలానే బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Read Also: Railway station: కొత్తగూడెంలో బాంబు పేలుడు భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

అధికారులకు ఆదేశాలు

ఇలాంటి ఘటనలను నివారించడం కోసం వీధి కుక్కలను కట్టడి చేయాలని.. ఇందు కోసం వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ (CM Revanth) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఎల్బీనగర్‌ ప్రాంతంలోని మన్సూరాబాద్‌ సమీపంలో ఉన్న శివగంగ కాలనీలో.. ఓ మూగ బాలుడిపై సుమారు 15 నుంచి 20 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేశాయి.

ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్‌ తిరుపతిరావు, చంద్రకళలు. జీవనోపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం వీరు హైదరాబాద్ నగరానికి వచ్చారు. మన్సూరాబాద్‌ (Mansoorabad) సమీపంలోని కాలనీలో ఉంటున్నారు. వీరి కుమారుడు ప్రేమ్‌చంద్‌ (చింటు) పుట్టుకతో మూగ బాలుడు.ఈక్రమంలో బాలుడు మంగళవారం ఉదయం ఇంటి నుంచి వీధిలోకి వెళ్లినప్పుడు సుమారు 15-20 కుక్కల గుంపు బాలుడిని తరుముతూ అతడిపై దాడి చేశాయి.

Boy injured in stray dog ​​attack.. CM Revanth responds

తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి

బాలుడు ధరించిన దుస్తులను లాగేసి మరీ కరిచాయి. పాపం అరవడానికి కూడా ఆ పసివాడికి అవకాశం లేదు. అదృష్టవవాత్తు.. ఆ పక్కగా వెళ్తున్న ఓ వ్యక్తి.. బాలుడిపై కుక్కుల దాడి చేయడాన్ని గమనించి.. కర్రతో వాటిని అదిలించి అక్కడ నుంచి వెళ్లగొట్టాడు. ఆ తర్వాత 108కు సమాచారం ఇచ్చాడు. ముందుగా బాలుడిని నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.గాయాలు తీవ్రంగా ఉండటంతో..

అక్కడి వైద్యుల సూచన మేరకు నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడిని అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కల దాడిలో బాలుడి చెవి తెగింది. నడుము, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఏమాత్రం ఆలస్యం జరిగినా.. చిన్నారి ప్రేమ్ చంద్ వీధి కుక్కల దాడిలో కన్ను మూసేవాడని వైద్యులు తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

hyderabad latest news mansoorabad Revanth Reddy response stray dogs issue Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.