📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Borabanda Crime: షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

Author Icon By Pooja
Updated: March 15, 2026 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Borabanda Crime: హైదరాబాద్‌లోని బోరబండలో గుండెలవిసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న మనస్పర్థ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. తమ వివాహ వార్షికోత్సవం నాడే ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీయాలని ప్రయత్నించి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి, ఐదేళ్ల కుమారుడు మృతి చెందగా, రెండేళ్ల చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

Read Also:Vizag Road Accident: విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

వివాహ వార్షికోత్సవం రోజున షాపింగ్‌కు వెళ్లలేదనే మనస్తాపం

వివరాల్లోకి వెళితే.. బోరబండ పెద్దమ్మనగర్‌కు చెందిన మురళి వేణు, సత్యవేణి (30) దంపతులకు రుద్రాన్ష్ (5), ధన్విక (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురళి విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం వారి పెళ్లి రోజు కావడంతో షాపింగ్‌కు వెళ్దామని సత్యవేణి కోరింది. అయితే, తన తండ్రికి డయాలసిస్ చేయించాల్సి ఉండటంతో, ఆసుపత్రికి వెళ్లాలని, షాపింగ్‌కు మరోరోజు వెళ్దామని మురళి ఆమెకు నచ్చజెప్పాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

భర్త తన తండ్రిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన తర్వాత సత్యవేణి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీవీ సౌండ్ పెద్దగా పెట్టి, గది తలుపులు వేసుకుంది. అనంతరం తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి, ఆ తర్వాత తానూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పని ముగించుకుని ఇంటికి వచ్చిన అత్త మంగాదేవి, ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసిన పోలీసులు; దర్యాప్తు ప్రారంభం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా, అప్పటికే సత్యవేణి మరియు కుమారుడు రుద్రాన్ష్ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రెండేళ్ల ధన్వికను వెంటనే చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, తన చెల్లెలి మృతికి భర్త మురళి మరియు అత్తమామల వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

#Borabanda #CrimeNewsTelugu #FamilyDisputes #HyderabadNews #Tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.