Bomb Threat: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

Read Time:  1 min
Bomb Threat: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు
FONT SIZE
GET APP

నాంపల్లి సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపు (Bomb Threat) తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామంటూ ఈ-మెయిల్ వచ్చింది. అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హుటాహుటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని బయటకు పంపించి, పోలీసులు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు (Bomb Threat) నిర్వీర్య దళాలతో తనిఖీలు చేపట్టారు.

Read Also: Hyderabad: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం

Bomb threat to Nampally court
Bomb threat to Nampally court

దర్యాప్తు ముమ్మరం

కోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఈ బెదిరింపు సందేశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.