📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Ravi Kishan: మరోసారి బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు

Author Icon By Aanusha
Updated: November 8, 2025 • 9:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ సినీ నటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్‌ (Ravi Kishan) కి మరోసారి బెదిరింపులు వచ్చాయి..ఈసారి ఏకంగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ హెచ్చరికలు రావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రవి కిషన్‌కు పూజలు నిర్వహించే జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి మొబైల్ ఫోన్‌కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది.

Read Also: HDFC: లోన్లు తీసుకున్నవారికి శుభవార్త చెప్పిన హెచ్ డిఎఫ్ సి

దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే.. రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ విహార్ కాలనీలో నివసించే ప్రవీణ్ శాస్త్రికి నవంబర్ 4న ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి, “ఈసారి మోదీ, యోగి ఇద్దరూ గెలవరు” అని హెచ్చరించడమే కాకుండా, తనను చంపేస్తానని, ఎంపీ రవి కిషన్‌ను కూడా చూసుకుంటానని బెదిరించినట్లు ప్రవీణ్ శాస్త్రి పోలీసులకు తెలిపారు.

అదే నంబర్ నుంచి తన వాట్సాప్‌కు ఒక మెసేజ్

ఆ తర్వాత అదే నంబర్ నుంచి తన వాట్సాప్‌కు ఒక మెసేజ్ వచ్చిందని, అందులో ఎంపీ రవి కిషన్ (Ravi Kishan), మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ శుక్లా ఫొటోలపై ‘X’ గుర్తు వేసి ఉందని ఆయన వివరించారు. ఆశ్చర్యకరంగా ఆ వాట్సాప్ నంబర్‌కు ప్రొఫైల్ పిక్‌గా లారెన్స్ బిష్ణోయ్ ఫొటో ఉండటం గమనార్హం. గతంలో కూడా రవి కిషన్‌కు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని,

Ravi Kishan

ఆ కేసులో గోరఖ్‌పూర్ పోలీసులు ఒకరిని అరెస్టు చేసి జైలుకు పంపారని ప్రవీణ్ శాస్త్రి గుర్తు చేశారు.ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రవి కిషన్ (Ravi Kishan) నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నారని, ఆయనకు భద్రత పెంచాలని ప్రవీణ్ శాస్త్రి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి,

బెదిరింపు కాల్ వచ్చిన నంబర్‌ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు

సైబర్ టీమ్ సహాయంతో బెదిరింపు కాల్ వచ్చిన నంబర్‌ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.కాగా, కొద్ది రోజుల క్రితం వచ్చిన బెదిరింపులపై రవి కిషన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. వాటికి తలవంచే ప్రసక్తే లేదు.

ప్రజా సేవ, జాతీయవాదం నాకు రాజకీయ వ్యూహాలు కాదు, అవి నా జీవిత సంకల్పం. ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నాను” అని ఆయన స్పష్టం చేశారు. తాజా ఘటన నేపథ్యంలో అధికారులు రవి కిషన్ భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

BJP MP Gangster threat latest news lawrence bishnoi Ravi Kishan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.