📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bijinepally crime: కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

Author Icon By Tejaswini Y
Updated: March 3, 2026 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bijinepally crime: మాతృత్వం మంట కలిసింది కడుపులో పెట్టుకొని చూసుకోవలసిన కన్నతల్లి కసాయిగా మారింది. మూడు నెలల పసికందు అని కనికరం లేకుండా కాపురానికి అడ్డస్తున్నాడని నీటి తొట్టిలో వేసి హతమార్చింది. పాలెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున మూడు నెలల బాలుడు అనుమానాస్పద మృతి చెందిన సంఘటన లో కాపురానికి అడ్డుగా వస్తున్నాడని కన్నతల్లే కడతేర్చిందని డిఎస్పి బుర్రి శ్రీనివాస్ వెల్లడించారు.

Read Also: Gulf Crisis: ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Bijinepally crime: Mother kills baby for obstructing settlement

పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాలెం గ్రామానికి చెందిన ఉల్లం గొండ్ల సీలమ్మ ను పానగల్ మండలం శాగాపూర్ గ్రామానికి చెందిన గుర్రంకొండ నరేంద్రకు 10 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేసినట్లు తెలిపారు. వివాహానంతరం వీరికి ఇద్దరు పిల్లలు. గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తుంది. అప్పుడప్పుడు భర్త నరేందర్ అత్తగారింటికి వచ్చి భార్యను కాపురానికి రమ్మని ప్రాధేయపడేవాడని వివరించారు.

భర్తతోపాటు అత్తమామలు వెళ్లిపోవడం

అత్తగారింటికి వెళ్లడం ఇష్టంలేని నీలమ్మ తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా జనవరి 4న కుమారుడు జన్మించగా గత నెల 27 తేదీన నరేందర్ తో పాటు, నీలమ్మ అత్తమామ పాలెం గ్రామానికి వచ్చి పంచాయతీ పెట్టి కాపురానికి రావాలంటూ కోరిన నిరాకరించినట్లు వివరించారు. భర్తతోపాటు అత్తమామలు వెళ్లిపోవడంతో అదే రాజు రాత్రి నిద్ర అనంతరం రెండు గంటల ప్రాంతంలో మూడు నెలల బాలుడిని ఇంటి ముందున్న నీటి తొట్టిలో పడవేసి కన్నతల్లే కడతేర్చింది అని డీఎస్పీ వెల్లడించారు. బాలుని హత్య చేసి భర్త కుటుంబీకులపై నెట్టే ప్రయత్నం చేయగా కుటుంధీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసిందని పోలీసులు వెల్లడించారు. పత్రికా సమావేశంలో సీఐ అశోక్ రెడ్డి ఎస్ఐ కే శ్రీనివాస్ తదితరులున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bijinepally crime Bijinepally Infant Murder Mother Kills Baby NagarKurnool crime news Palem Village Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.