ప్రస్తుతం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (ED) బాగా దూకుడు చూపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలు సినీ నటీనటులను విచారించింది. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతే,బెంగాల్ నటీ, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి (Urvashi, Mimi Chakraborty) కి నోటీసులు జారీ చేశారు. ED ఆదేశాల ప్రకారం, మిమి చక్రవర్తి ఈ నెల 15న, ఊర్వశి రౌతేలు ఈ నెల 16న ఢిల్లీలోని ED కార్యాలయంలో హాజరుకావలసి ఉంది.
ఈ ఇద్దరు ప్రముఖులు 1xBet అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ (online betting app) ను ప్రచారం చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది. నేషనల్ లెవల్ లో పరిశీలన కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారం సామాజికంగా పెద్ద చర్చకు కారణమైంది.
సాంఘికంగా, సినీ తారలు తమ ప్రమోషన్ ద్వారా ప్రేక్షకులపై ప్రభావం చూపుతారని ED ముఖ్యంగా గమనిస్తోంది.ఆ మరుసటి రోజు, అంటే సెప్టెంబర్ 16న, ఊర్వశి రౌతేలాను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో సినీ ప్రముఖులకు (movie celebrities) సమన్లు జారీ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలువురు నటీనటులు, క్రీడాకారులను కూడా ఈడీ విచారించింది.
సినీ తారలు తమ ప్రమోషన్ ద్వారా
ఇదే 1xBet కేసుకు సంబంధించి మాజీ భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను కూడా ఈడీ ఇటీవల ప్రశ్నించింది. ఈ యాప్‌కు సంబంధించిన ప్రకటనలలో నటించడం, ప్రచార ఒప్పందాల గురించి వారి నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. సైప్రస్ కేంద్రంగా పనిచేసే 1xBet, ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ క్యాసినోలలో ఒకటిగా పేరుపొందింది. ఆర్థికపరమైన ఆరోపణల నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు ఈ సంస్థ కార్యకలాపాలను నిషేధించాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: