📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి..

Bengal: ఉద్యోగంలో చేరిన 4 రోజులకే నర్సు అనుమానాస్పద మృతి..

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగాల్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హుగ్లీ జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సు అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. ఆస్పత్రి యాజమాన్యం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ, మృతురాలి కుటుంబం ఈ నిర్ణయాన్ని తీరని అని, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు అరోపిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.మృతురాలి వయసు 24 సంవత్సరాలు అని తెలుస్తోంది. ఆమె ఇటీవల సింగూర్‌ (Singur) లోని ఒక నర్సింగ్ హోమ్లో జాయిన్ అయి పనిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం సింగూర్‌లోని ఈ నర్సింగ్ హోమ్‌లో మొదటి పని రోజు ప్రారంభించింది. యువతీ ఒక ప్రతిష్టాత్మక ప్రైవేట్ హాస్పిటల్‌లో పని ప్రారంభించడంతో కుటుంబంలో సంతోషం నెలకొన్నప్పటికీ, ఈ విషాద ఘటన కుటుంబాన్ని ఆందోళనలో మునిగించింది.

పోలీసులు దర్యాప్తు

ఈక్రమంలోనే.. గురువారం హాస్పిటల్‌ మూడో అంతస్తులోని గదిలో సీలింగ్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నర్సు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత నర్సు మరణానికి కారణం తెలుస్తుందని పోలీస్‌ అధికారి తెలిపారు.పుర్బా మెదినిపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌ (Nandigram) కు చెందిన ఆ నర్సు నాలుగు రోజుల కిందటే ఆ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లో చేరినట్లు ఆమె కుటుంబం తెలిపింది. ఆ హాస్పిటల్‌లో నిర్వహించే ఆపరేషన్లలో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు నర్సింగ్ హోమ్ యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. ఆ నర్సు ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.

Bengal

నర్సు మృతిపై అనుమానం వ్యక్తం

కాగా, బెంగాల్‌లో ప్రతిపక్షమైన బీజేపీ, సీపీఎం పార్టీలు ఈ సంఘటనపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. నర్సు మృతిపై అనుమానం వ్యక్తం చేశాయి. పారదర్శకంగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని బెంగాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో లేడీ డాక్టర్‌ హత్యాచార ఘటన మరవక ముందే సింగూరు ఆస్పత్రిలో ఈ ఘటన జరగడం తీవ్ర సంచలనం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విపక్ష నేతలు ఆరోపించారు. మహిళలకు భద్రత లేదని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/dharmavaram-nia-on-high-alert-over-dharmavaram-terror-attack-one-person-arrested/andhra-pradesh/530955/

Alleged Rape Bengal Crime Breaking News Family Demands Justice Hugli District latest news Nurse Death Private Hospital Singapore Nursing Home Suspicious Death Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.