📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Medchal-బార్ బిల్లు వివాదం… బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Author Icon By Pooja
Updated: September 23, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు చెందిన జాదవ్ సాయితేజ (బీటెక్ రెండో సంవత్సరం), ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతూ నారపల్లిలోని(Narapalli) హాస్టల్‌లో ఉండేవాడు.

తాజాగా తన స్నేహితులతో కలిసి ఒక పుట్టినరోజు వేడుకకు హాజరైన సాయితేజ, అక్కడ చిన్నపాటి గొడవ తలెత్తడంతో సీనియర్ విద్యార్థి బండారి చిన్నబాబు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చాడు. అయితే, దీని ప్రతిఫలంగా పార్టీ అడిగిన చిన్నబాబు, సాయితేజను మరికొంతమంది విద్యార్థులతో కలిసి బార్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం బిల్లు రూ. 8,000 వస్తే, సాయితేజ దగ్గరున్న రూ. 2,500 మాత్రమే చెల్లించాడు. మిగిలిన మొత్తానికి ఒత్తిడి చేయడంతో పాటు, అందరి ఎదుట తీవ్ర అవమానం ఎదుర్కొన్నాడు.

మృతిపై విద్యార్థి సంఘాల ఆందోళనలు

దీంతో మనస్తాపానికి గురైన సాయితేజ, హాస్టల్ గదికి వెళ్లి తన తండ్రికి వీడియో కాల్ చేసి, సీనియర్ వేధింపులు(Senior harassment) భరించలేక ఆత్మహత్యకు పాల్పడతానని తెలిపాడు. అనంతరం గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఆర్. గోవిందరెడ్డి వెల్లడించారు.

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కళాశాల ముందు, పోలీస్ స్టేషన్ వద్ద, జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టాయి. కళాశాల యాజమాన్యం స్పందిస్తూ, ప్రధాన నిందితుడు చిన్నబాబు గత ఏడాది నుంచి తరగతులకు హాజరుకాలేదని స్పష్టం చేసింది.

సాయితేజ ఎవరు?
ఆదిలాబాద్‌కు చెందిన సాయితేజ, ఘట్‌కేసర్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం బీటెక్ విద్యార్థి.

ఆత్మహత్యకు కారణం ఏమిటి?
సీనియర్ విద్యార్థి పార్టీ పేరుతో ఒత్తిడి చేయడం, బార్ బిల్లు చెల్లించలేకపోవడంతో అవమానించడం కారణంగా సాయితేజ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

engineering college Google News in Telugu Latest News in Telugu Medchal Crime Senior Ragging Student suicide Telangana news Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.