📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Bapatla: క్వారీలో భారీ బండరాళ్లు పడి ఆరుగురి మృతి

Author Icon By Anusha
Updated: August 3, 2025 • 2:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది. గ్రానైట్ క్వారీ (Granite Quarry) లో బండరాళ్లు ఒక్కసారిగా విరిగి పడటంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా, కొంతమంది ఇంకా రాళ్ల కింద చిక్కుకుని ఉన్నారని సమాచారం. ఈ ఘటన స్థానికంగా విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.ప్రతిరోజు లాగే కార్మికులు ఉదయం పని కోసం క్వారీకి చేరుకున్నారు. అయితే, అకస్మాత్తుగా భారీ రాళ్లు పగిలి కూలిపడటంతో ప్రమాదం సంభవించింది. అక్కడ పనిచేస్తున్న 16 మంది కార్మికుల్లో ఎక్కువమంది ఒడిశాకు చెందినవారని పోలీసులు తెలిపారు. కూలిన రాళ్ల కింద కొందరు చిక్కుకోవడంతో సహాయక చర్యలు చేపట్టారు.గాయపడినవారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్వారీలో రాళ్లు ఒక్కసారిగా పడటంతో వాటి కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

Bapatla:

ప్రమాదం వివరాలు

క్షతగాత్రులను అంబులెన్స్‌లో నర్సారావుపేట ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఒక్కసారి గ్రానైట్ శ్లాబు (Granite slab) విరిగిపడటంతో శిథిలాల కింద కార్మికులు ఇరుక్కుపోయారు.ఇప్పటి వరకు నాలుగు మృత దేహాలను బయటకు తీసినట్టు అధికారలు తెలిపారు. బండరాళ్ల కింద చిక్కుకున్న మృత దేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీటిని వెలికితీస్తే ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది స్పష్టత వస్తుంది. ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు.మొత్తం 10 మంది కార్మికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్వారీ నిర్వహాకులు సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దుర్ఘఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్థానిక అధికారులతో మాట్లాడి రెస్క్యూను వేగవంతం చేయాలని ఆదేశించారు.

బాపట్లలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఏవి?

బాపట్లలోని సూర్యలంక బీచ్, భవనారాయణస్వామి ఆలయం, బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ముఖ్యమైన ప్రదేశాలు.

బాపట్లకు పేరు ఎలా వచ్చింది?

ట్టణంలో ఉన్న భవనారాయణస్వామి దేవాలయం పేరుమీదుగా ఈ పట్టణాన్ని “భవనపురం” అని పిలిచేవారు. అది క్రమంగా “బాపట్ల”గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-woman-dies-after-jumping-from-fifth-floor-claiming-to-be-going-to-god/telangana/525187/

Andhra Pradesh accident news Ballikurava tragedy Bapatla district latest news Bapatla granite quarry mishap Bapatla quarry accident Breaking News latest news Telugu News workers killed in quarry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.