📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: Bapatla Crime: ఘోరం.. పొట్టిగా ఉన్నాడని బావను హతమార్చిన బావమరిది

Author Icon By Anusha
Updated: October 10, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాపట్ల జిల్లా (Bapatla District) లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేమూరు మండలానికి చెందిన ఓ యువకుడు, తన చెల్లి వివాహం తనకు నచ్చలేదని, బావ పొట్టిగా ఉన్నాడనే కారణంతో హత్యకు పాల్పడ్డాడు.

Blasting: అయోధ్యలో పేలుడు..ఐదుగురి మృతి

తనకు ఇష్టం లేని వ్యక్తిని చెల్లి వివాహం చేసుకోవడంతో అతిడిపై కక్షగట్టాడు. పక్కా ప్రణాళికతో స్నేహితుల సహాయం తో కత్తులతో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలంలో జరిగింది. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా నాగ గణేష్‌కు (25) కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగంజాగర్లమూడిలో నివాసం ఉంటున్నాడు.

అయితే ఉగ్యోగ నిమిత్తం గుంటూరు పవర్ ఆఫీసు సమీపంలోని బుడంపాడులో మూడు నెలలుగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువులైన తెనాలి (Tenali) కి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లాడు గణేష్. పెళ్లిచూపుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే అంజనీదేవి సోదరుడు, ఆమె కుటుంబ సభ్యులు ఈ సంబంధం వద్దని చెప్పారు.

Bapatla Crime

పూర్తి వివరాలు

అయినప్పటికీ ఇరువురూ కొద్ది రోజులు ఫోన్లో మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 25న ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. అనంతరం అమరావతి ఆలయంలో పెళ్లి చేసుకుని.. బుడంపాడులో కాపురం పెట్టారు.తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. రక్షణ కల్పించాలని కోరుతూ కొత్తజంట నల్లపాడు పోలీసులను (Nallapadu Police) ఆశ్రయించారు.

దీంతో ఇరువురి కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి.. సీఐ వంశీధర్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కాగా, పోలీస్‌ స్టేషన్‌లోనే తన బావను చంపేస్తానంటూ.. వధువు అన్న దుర్గారావు హెచ్చరించారు. దూర్గారావు హెచ్చరికలను పట్టించుకోనప్పటికీ గణేష్ (Ganesh) బయటకు ఎక్కువగా తిరగకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు.

రిసెప్షన్ గ్రాండ్‌గా చేసుకోవాలని గణేష్ అనుకున్నాడు

ఈ క్రమంలో పెళ్లి గుడిలో చేసుకున్నాం కాబట్టి.. రిసెప్షన్ గ్రాండ్‌గా చేసుకోవాలని గణేష్ అనుకున్నాడు. అందుకోసం తన స్నేహితుడు తో కలిసి గుంటూరుకు వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు.డబ్బు తీసుకుని ఇంటికి వస్తున్న గేణేష్‌ను.. మార్గమధ్యలో దుర్గారావు మరో ఇరువురుతో కలిసి అడ్డగించి గొడవపడ్డాడు. అనంతరం అందరూ గణేష్‌ను రాయితో కొట్టారు.

తర్వాత కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. వెంటనే స్నేహితుడు, గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే గణేష్ (Ganesh) మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పరారీలో ఉన్న దుర్గారావు, అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణలో బావ.. తన సోదరి కంటే పొట్టిగా ఉన్నాడనే చంపినట్లు దుర్గారావు నేరం అంగీకరించాడు. తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. అందుకే చంపినట్లు చెప్పాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bapatla murder Breaking News inter-caste marriage latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.