📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bapatla Crime: పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

Author Icon By Anusha
Updated: March 13, 2026 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bapatla Crime: బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో గురువారం రాత్రి గుండెలవిసే ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి సుజాత (46), కూతురు దివ్య (25) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దివ్యకు శేషుబాబు అనే యువకుడితో వివాహం నిశ్చయమై, ఘనంగా నిశ్చితార్థం (Engagement) కూడా జరిగింది. అయితే పెళ్లికి కొద్దిరోజుల ముందు వరుడు శేషుబాబు మనసు మార్చుకుని, వివాహం చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో నిండైన భవిష్యత్తు ఉన్న యువతి జీవితం ఒక్కసారిగా అంధకారమైంది.

Read Also: Vijayawada Crime: విదేశీ విద్య పేరిట కన్సల్టెన్సీ మోసం

Bapatla Crime: Groom refused to marry.. Mother and daughter died after consuming poison

వీడియోలు, ఫోటోలతో వేధింపులు.. మానసిక క్షోభ

కేవలం పెళ్లి నిరాకరించడమే కాకుండా, శేషుబాబు అత్యంత నీచంగా వ్యవహరించినట్లు సమాచారం. గతంలో దివ్యను రహస్యంగా తీసిన ఫోటోలు, వీడియోలను చూపిస్తూ ఆమెను మానసిక క్షోభకు గురిచేశాడని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. తన పరువు బజారున పడుతుందని, నిశ్చితార్థం జరిగిన వ్యక్తి ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడని దివ్య తీవ్ర మనస్థాపానికి గురైంది. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని భరించలేకపోయిన తల్లి సుజాత కూడా ఆమెతో కలిసి బలవన్మరణానికి సిద్ధపడింది.చికిత్స పొందుతూ దివ్య, సుజాతలు మృతి చెందారు. మార్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bapatla Crime Betrayal after Engagement Dronadula Village Suicide Case Mother Daughter Suicide in Martur

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.