Kamareddy Girl Suicide Attempt: సెల్‌ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు మందలించారని ఒక నిండు ప్రాణం బలికావాల్సిన స్థితి నుండి, ఒక అధికారిణి చూపిన చొరవ వల్ల ఆ కుటుంబంలో వెలుగులు నిండాయి.
Read Also: Telangana Budget updates : జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం
అసలేం జరిగింది?
మహ్మద్‌నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన స్రవంతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) సెలవులకు ఇంటికి వచ్చింది. ఎక్కువగా ఫోన్‌లోనే గడుపుతుండటంతో బుధవారం రాత్రి తల్లిదండ్రులు కాస్త గట్టిగా మందలించారు. ఆ చిన్న మాటకే మనస్తాపం చెందిన స్రవంతి.. గురువారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామ శివారులోని 60 అడుగుల ఎత్తైన నీటి ట్యాంకు ఎక్కేసింది. తాను కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటానని కేకలు వేయడంతో గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎంత బ్రతిమిలాడినా.. పోలీసులు నచ్చజెప్పినా ఆమె వినకుండా చనిపోతానని బెదిరించింది.

ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రాత్రి 8 గంటల సమయంలో నేరుగా గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన ఆమె.. ఏమాత్రం వెనుకాడకుండా ఇనుప నిచ్చెన మెట్లు ఎక్కి ట్యాంకు పైకి వెళ్లారు. ఒక అధికారిణిలా కాకుండా.. ఒక ఆత్మీయమైన అక్కలా స్రవంతి పక్కన కూర్చుని దాదాపు గంటన్నర పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటానని, నీ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సబ్‌కలెక్టర్ మాటలతో శాంతించిన స్రవంతి.. చివరకు ఆమె చేయి పట్టుకుని సురక్షితంగా కిందికి దిగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: