తల్లిదండ్రులు తమ బిడ్డల(Banglore Crime) కోసం ఎంతో కష్టపడుతుంటారు. తల్లిదండ్రులకు పిల్లలే కదా ప్రపంచం. బంగారు భవితకు పునాదులు వేస్తారు. మంచి ప్రవర్తన కలిగి సమాజానికి ఆదర్శంగా ఉండాలని హితవు పలుకుతుంటారు. మంచిగా, బుద్ధిగా చదువుకుని, ఉద్యోగంలో స్థిరపడాలని చెబుతుంటారు. ఇవన్నీ తమ క్షేమం కోసమేనని భావించే పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారు. కానీ దాన్ని వ్యతిరేకించే పిల్లలు తల్లిదండ్రులపై కోపాన్ని పెంచుకుంటారు. ఆ కోపం కొన్ని అనర్థాలకు దారితీయవచ్చు. సరిగా ఓ మైనర్ బాలిక విషయంలో ఇదే జరిగింది. స్నేహితులతో తిరగొద్దని చెప్పినందుకు తల్లిపై కక్షపెంచుకుని, స్నేహితులతో కలిసి తల్లినే హతమార్చింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Anchor Shyamala: యాంకర్ శ్యామలపై కేసు

వెలుగులో భయంకరమైన విషయాలు
బెంగళూరులోని(Banglore Crime) సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మహిళ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన పోలీసులకు భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. మృతురాలిని బెంగళూరుకు సమీపంలోని ఉత్తరహళ్లి నివాసి 34 ఏళ్ల నేత్రావతిగా గుర్తించారు. నేత్రావతి తన 15 ఏళ్ల కుమారై (9వ తరగతి డ్రాపౌట్), ఆమె స్నేహితులతో ముఖ్యంగా ఆమెకు ఉన్న 17ఏళ్ల బాయ్ ఫ్రెండ్ తో సంబంధాన్ని వ్యతిరేకించింది.
కూతురు ప్రవర్తనపై మందలించిన తల్లి
కూతురు స్నేహితులు తరచుగా ఇంటికి రావడం ఆమెకు నచ్చేది కాదు. కూతురి ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె తల్లి ఇటీవల గట్టిగా మందలించింది. ఇది అవమానంగా భావించిన బాలిక తల్లిపై పగ పెంచుకుంది. తన నలుగురు స్నేహితులతో కలిసి చంపేయాలని నిర్ణయించుకుంది. గత నెల 25న 17ఏళ్ల లోపు వయస్సున్న నలుగురు స్నేహితులను తన ఇంటికి పిలిపించుకుంది. పక్కగదిలో నిద్రపోతున్న బాలిక తల్లి పిల్లల విపరీత నవ్వులకు నిద్ర లేచింది. లోపలికి వెళ్లి చూడగా నలుగురు అబ్బాయిలతో తన కూతురు అభ్యంతరకర స్థితిలో ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో తల్లి కూతురిని మరోసారి మందలించింది. అప్పటికే ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్న ఆ నలుగురు మైనర్ బాలుర్లు ఆమె నోటిని మూసి, గొంతుకు తువ్వాలుతో బిగించి హత్య చేశారు.
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నాటకం
తన తల్లి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి, తప్పించుకునేందుకు యత్నించారు. మృతదేహాన్ని చీరతో ఫ్యాన్ కు కట్టి వేలాడదీశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే మరునాడు ఇంటికి వచ్చిన ఆమె సోదరి చూసి షాక్ అయింది. మృతదేహాన్ని గుర్తించి, స్థానికులు, బంధువుల సాయంతో అంత్యక్రియలు జరిపించింది. అయితే తల్లి చనిపోయిందని తెలిసినప్పటికీ కూతురు అంత్యక్రియలకు హాజరు కాకపోవడం పట్ల పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా బాలిక అసలు నిజాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు బాలిక సహా నలుగురు బాలలను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: