📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Bangladesh Cricket: మహిళా క్రికెటర్ ఫిర్యాదు.. మాజీ ఆటగాడిపై చర్యలు

Author Icon By Aanusha
Updated: February 22, 2026 • 11:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangladesh Cricket:బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపిన ఘటనలో మాజీ అంతర్జాతీయ క్రికెటర్ మంజురుల్ ఇస్లాంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అతనిపై తక్షణ నిషేధం విధిస్తూ, బోర్డు పరిధిలో జరిగే ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also: India vs South africa : మిల్లర్ మెరుపులు, భారత్ ముందు 188 పరుగుల భారీ లక్ష్యం

నాలుగు ఆరోపణలపై కమిటీ విచారణ జరిపింది

బంగ్లాదేశ్ మాజీ మహిళా కెప్టెన్ జహనారా ఆలం చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన స్వతంత్ర కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు బీసీబీ తెలిపింది. 2022 ప్రపంచ కప్ సమయంలో మంజురుల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని జహనారా ఆరోపించింది.జహనారా చేసిన నాలుగు ఆరోపణలపై కమిటీ విచారణ జరిపింది. వీటిలో రెండింటికి సరైన ఆధారాలు లభించనప్పటికీ, మిగిలిన రెండింటిలో మంజురుల్ అసభ్యంగా ప్రవర్తించినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కమిటీ తేల్చింది.

Bangladesh Cricket: మహిళా క్రికెటర్ ఫిర్యాదు.. మాజీ ఆటగాడిపై చర్యలు

గతంలో మహిళల జట్టు సెలెక్టర్‌గా, మేనేజర్‌గా పనిచేసిన మంజురుల్ కాంట్రాక్ట్ 2025 జూన్ 30తో ముగిసింది. అతని ప్రవర్తన వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది వేధింపుల కిందకే వస్తుందని కమిటీ పేర్కొంది.ఇదే సమావేశంలో, తొలిసారిగా నిర్వహించనున్న మహిళల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూబీపీఎల్) షెడ్యూల్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ టోర్నీ 2026 ఏప్రిల్ 4 నుంచి 14 వరకు ఢాకా, ఛటోగ్రామ్ వేదికలుగా జరగనుంది. అలాగే, జాతీయ సెలక్షన్ ప్యానెల్ ఛైర్మన్ గాజీ అష్రాఫ్ హుస్సేన్ పదవీకాలాన్ని మరో నెల పొడిగించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BangladeshCricket BCB JahanaraAlam ManjurulIslam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.