📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Bangalore Crime: జైలులో ఖైదీల మందు పార్టీ హల్ చల్

Author Icon By Tejaswini Y
Updated: November 10, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులోని(Bangalore Crime) ప్రసిద్ధ పరప్పన అగ్రహార జైలు మరోసారి సంచలనానికి కారణమైంది. ఇటీవల ఖైదీలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్న వీడియో బయటపడటంతో ఇప్పటికే వివాదం చెలరేగగా, ఇప్పుడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో కొంతమంది ఖైదీలు జైలులోనే మద్యం పార్టీ చేసుకుంటూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Read Also: USA: ఇక అమెరికన్ పౌరుడికి 2వేల డాలర్లు.. ట్రంప్ ఆఫర్

ఖైదీలకు రాచరిక సౌకర్యాలు

అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు కూడా గతంలో అధికారులు రాయల్టీ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లు ఆరోపణలు రావడం గుర్తు చేసుకుంటున్నారు. దర్శన్ ఖైదీలతో కలిసి ఆడుతూ, బాతాఖానీ వేస్తున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇదే జైలులో ఇటీవల బయటకు వచ్చిన మరో వీడియోలో ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు కనిపించాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు యువకులను ప్రేరేపిస్తున్నాడని ఆరోపణలపై జైలులో ఉన్న ఐఎస్ రిక్రూటర్‌కు జైలు అధికారులు టీవీతో పాటు రెండు మొబైల్ ఫోన్లు(mobile phones) కూడా అందుబాటులో ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బయటపడిన వీడియోలో మద్యం సీసాలు, చిప్స్, గ్లాసులు కనిపించడంతో జైలు నిర్వహణపై ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనలపై సీరియస్‌గా స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. జైలు అధికారుల నిర్లక్ష్యం, ఖైదీలకు ప్రత్యేక సౌకర్యాలు అందించడం వంటి అంశాలపై సవివరమైన దర్యాప్తు జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BangaloreNews JailControversy JailPartyVideo KannadaActorDarshan KarnatakaGovernment KarnatakaNews ParappanaAgraharaJail ViralVideo

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.