📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Bangalore: ప్రియురాలి కోసం భార్యను చంపిన బెంగళూరు వైద్యుడు

Author Icon By Shiva
Updated: November 4, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు(Bangalore)ను షాక్‌కు గురి చేసిన డాక్టర్ కృతికా రెడ్డి మరణం కేసులో కొత్త వివరాలు బయటపడ్డాయి. ఏప్రిల్ 21న కృతికా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందగా, మొదట ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి అనారోగ్యంతో మరణించిందని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, వైద్య పరీక్షల్లో ఆమె మత్తుమందు అధిక మోతాదు వల్ల చనిపోయినట్లు తేలడంతో కేసు మలుపు తిరిగింది.

Read Also: Karthika Pournami: వ్రతం, దీపారాధనకు శుభ సమయాలు ప్రకటించిన పండితులు

పోలీసులు దీన్ని హత్యగా భావించి విచారణ ప్రారంభించారు. దాదాపు ఆరు నెలల లోతైన దర్యాప్తు అనంతరం, మహేంద్ర రెడ్డే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్టోబర్ 15న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

హత్య వెనుక ప్రేమ వ్యవహారం
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కృతిక అనారోగ్యంతో ఉన్న వేళ, మహేంద్ర ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు నటించాడు. అయితే ఆమెకు అధిక మోతాదులో మత్తుమందు ఇంజెక్ట్ చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

తర్వాత, తన ప్రియురాలికి “నీ కోసం నా భార్యను చంపేశాను” అంటూ సందేశం పంపించాడు. సాధారణ మెసేజింగ్ యాప్‌లు కాకుండా, ట్రేస్ చేయడం కష్టమయ్యే డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా ఆ సందేశం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టిన పోలీసులు, మహేంద్ర ప్రియురాలిని కూడా విచారించి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు తెలిపారు. అయితే ఆమె వివరాలను గోప్యంగా ఉంచారు.

ఈ కేసుతో మరోసారి ప్రేమ వ్యవహారం పేరుతో జరిగే హత్యలు, వాటి వెనుక దాగి ఉన్న దారుణాలపై చర్చ మొదలైంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BengaluruCrime BengaluruNews BreakingNews CrimeInvestigation CrimeUpdate DoctorArrested DrKrithikaReddyMurder KarnatakaNews LoveAffairMurder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.