हिन्दी | Epaper
కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

Australia terror plot :ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

Sai Kiran
Australia terror plot :ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

Australia terror plot : బోండీ బీచ్ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడిన ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. నమ్మదగిన సమాచారం అందుకున్న ఆస్ట్రేలియా పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్‌లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యలతో పెద్ద ప్రమాదాన్ని తప్పించామని పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉన్న సమయంలో ఇద్దరు గన్‌మెన్లు బీచ్‌లోకి ప్రవేశించి కాల్పులు జరపడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.

Latest News: LIG Flats: హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

స్థానికుల వివరాల ప్రకారం, నల్లటి ముసుగులు (Australia terror plot) ధరించిన ఇద్దరు వ్యక్తులు పాదచారుల వంతెనపై నుంచి కాల్పులు జరిపారు. అనంతరం వీరు తండ్రి–కొడుకులుగా గుర్తించబడ్డారు. తండ్రి సాజిద్ అక్రమ్ (50), కుమారుడు నవీద్ అక్రమ్ (24)గా పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరూ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులని దర్యాప్తులో తేలినట్టు సమాచారం.

కారులో వెంటాడి అరెస్ట్ చేసిన పోలీసులు

ఇదే సమయంలో మరో దాడి జరగబోతుందన్న సమాచారంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పదంగా కదులుతున్న రెండు వాహనాలను కార్ ఛేజ్ చేసి అడ్డగించి, అందులో ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ముందుగానే దాడికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకున్నారని పోలీసులు వెల్లడించారు.

అయితే, తాజాగా అరెస్ట్ అయిన ఈ ఏడుగురికి బోండీ బీచ్ కాల్పుల ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. బోండీ బీచ్ ఘటన తర్వాత దేశంలో భద్రతా ఆందోళనలు పెరిగాయని, అందుకే మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870