📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Armoor Road Accident: ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

Author Icon By Tejaswini Y
Updated: March 14, 2026 • 5:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Armoor Road Accident: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. పిప్రి గ్రామ శివారులో ఆటో, స్కూటీ ముఖాముఖి ఢీకొన్న ఘటనలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు.

Read Also : Shocking Crime News Hyderabad: పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

Armoor Road Accident: Auto-Scooty Collision.. Two Youths Dead on the Spot

ఘటన వివరాలు

పోలీసుల కథనం ప్రకారం.. సంచు శ్రీనివాస్ మరియు విజయ్ అనే ఇద్దరు యువకులు తమ స్కూటీపై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక ఆటో అతివేగంతో వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

పోలీసుల చర్యలు

ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ షాహేద్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Armoor Pipri Road Accident Armoor Road Accident nizamabad Pipri Road Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.